లీక్ అయిన బాలయ్య – అనిల్ మూవీ టైటిల్.. ర‌ఫ్పాడించేశాడుగా…!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ లోనే వరుస‌ సినిమాలు చేస్తూ బిజీగా దూసుకుపోతున్నాడు. గత సంవత్సరం వచ్చిన అఖండ సినిమాతో తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌ అందుకున బాలయ్య.. ఆ సినిమా తర్వాత క్రాక్ తో అదిరిపోయే హిట్ కొట్టి సూపర్ ఫామ్ లోకి వచ్చిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహారెడ్డి సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఓ సాంగ్ మిన‌హ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకులు ముందుకు వస్తుంది.

Anil Ravipudi and Nandamuri Balakrishna's NBK 108 first look is out

ఈ సినిమా తర్వాత బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతున్న క్రేజీ దర్శకుడు అనిల్ రావిపూడి తో 108వ సినిమా చేయబోతున్నాడు. ఇక నిన్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా.. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఎక్సైటింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇక ఈ సినిమాలో బాలయ్య 55 సంవత్సరాల వయసు ఉన్న తండ్రి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో బాలకృష్ణ కూతురుగా శ్రీ లీల నటించబోతుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా టైటిల్ లీక్ అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది.

NBK 108: Anna Get Down! Gippadi Sandi Calculations Tucker.. Balakrishna  Never Before!

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టైటిల్ గా బ్రో ఐ డోంట్ కేర్ అని టైటిల్‌ని ఫిక్స్ చేశారట. ఇక ఈ సినిమాలో బాలయ్య తన పాత సినిమాలకు భిన్నంగా ఎంతో స్టైలిష్ లుక్ లో బాలకృష్ణను అనిల్ చూపించబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ క్యారెక్టర్ ఎవరికి భయపడిని వ్యక్తిగా ఉండటంతో పాటు కాస్త కామెడీ టచ్ కూడా ఉంటుందట. అందుకే ఈ సినిమాకు ఆ టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం.

NBK 108: Balakrishna-Anil Ravipudi film launches with a pooja ceremony |  123telugu.com

ఇప్పుడు ఈ టైటిల్ బాలకృష్ణకు సెట్ అవుతుందా.. అన్న అనుమానాలు అభిమానుల్లో వస్తున్నాయి.. పవర్ఫుల్ టైటిల్స్ కు పెట్టిన పేరు బాలకృష్ణ సినిమాలు. అలాంటి బాలకృష్ణ సినిమాకు ఈ ఇంగ్లీష్ టైటిల్ తో ఆయన అభిమానులు సంతృప్తి చెందుతారా ? అనే అనుమానాలు వస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలంటే ఈ సినిమా టైటిల్ కు సంబంధించి అధికార ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.