వరుస విజయాలతో దూసుకుపోతూ ముందుకెళ్లిన కొరటాల శివ వరుస విజయాలకు చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య బ్రేక్ వేసింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. అయితే చిరంజీవి ఆచార్య ఫ్లాప్ నుంచి త్వరగానే కోలుకొని గాడ్ ఫాదర్ తో డీసెంట్ హిట్ కొట్టి గాడిలోపడ్డాడు. కానీ కొరటాల శివ మాత్రం అ ప్లాప్ నుంచి బయటకు రాలేక పోతున్నాడు.
ఈ సినిమాకి కొరటాల దర్శకుడిగానే కాకుండా.. బిజినెస్ వ్యవహారాల్లో కూడా వేలు పెట్టి.. అ సినిమా ప్లాప్ అవడంతో డిస్ట్రిబ్యూటర్స్ తాకిడి నుంచి ఆయన ఇప్పటికి పూర్తిగా తేరుకోలేదు. అందుకే ఆచార్య సినిమా విడుదలైన తర్వాత నుంచి కొరటాల శివ మీడియా ముందుకు రావడానికి సాహసించడం లేదు. ఆచార్య తేడా కొడుతుందన్న డౌట్ ఉందో ఏమోగాని కొరటాల ఆ సినిమా రిలీజ్కు ముందే సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పేశాడు. ఆయన రీసెంట్ గా ఓ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా హాజరు కావాల్సి ఉంది.
ప్రముఖ దర్శకుడు దశరధ్ లవ్ యు రామ్ అనే సినిమా ద్వారా నిర్మాతగా మరుతున్నాడు .అ సినిమా ప్రారంభోత్సవానికి మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్ తో పాటుగా కొరటాలని కూడా ఆహ్వానించాడు. ముందుగా కొరటాల రావడానికి ఒప్పుకున్నాడు. తర్వాత మీడియా సమావేశం కూడా ఉందని తెలియడంతో కొరటాల చివరి నిమిషంలో నో చేప్పడంతో ఇప్పడు ఈ విషయం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
అక్కడ ఆచార్య ప్రస్తావన, ప్రశ్నలు ఎదురవుతాయని… వాటిని ఎదుర్కొనే ధైర్యం లేకనే కొరటాల శివ అ ఫంక్షన్ కి నో చేప్పినటు ఓ టాక్ నడుస్తుంది. ప్రస్తుతం కొరటాల ఎన్టీఆర్ తో సినిమా చేయ్యబోతున్నాడు. అ సినిమా షూటింగ్ కూడా తర్వాలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమా ద్వారా కొరటాల తానేంటో ఫ్రూవ్ చేసుకోవాలన్న కసితో ఉన్నాడు.