వెండితెర రతీదేవి సిల్క్ స్మితకి జరిగిన అన్యాయం పగవాడికి కూడా జరగకూడదు!

కళ్లతోనే మగవారికి మత్తెక్కించే సినీ నటి సిల్క్ స్మితని తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఈ ముద్దుగుమ్మ హస్కీ వాయిస్‌తో చెప్పే డైలాగులు వింటుంటే చెమటలు పడుతుంటాయి. పెద్దగా ఎక్స్‌పోజ్ చేయకపోయినా తన సెక్సీ మాటలతో ఆకట్టుకునే ఈ తార చాలా తక్కువ వయసులోనే లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది. ఈ హాట్ బాంబ్ చనిపోయి ఇప్పటికే ఎన్నో ఏళ్లు అవుతోంది. అయినా కూడా ఇప్పటికీ ఆమె గురించి మాట్లాడుకునేవారు ఎందరో ఉన్నారు. ఆమె గురించి సినిమాలు చేస్తున్నారు. ఆమె క్యారెక్టర్లు ఇప్పటికీ వేస్తూ ఎప్పటికీ మర్చిపోలేని కళాకారుణిగా చేస్తున్నారు.

విశేషమేంటంటే.. రీసెంట్ టైమ్‌లో ఈమె బయోపిక్ సినిమాలు కూడా వచ్చి హిట్ అయ్యాయి. విద్యాబాలన్, వీణా మాలిక్ సిల్క్ స్మిత జీవిత చరిత్ర ఆధారంగా రెండు సినిమాలు తీశారు. డర్టీ పిక్చర్ అనే చెడ్డ పేరుతో సినిమా తీసి ఆమె పుట్టినరోజు నాడే విడుదల చేశారు. ఈ సినిమా వారు ఆమె బతికున్నప్పుడే కాకుండా ఆమె చనిపోయిన తర్వాత కూడా ఆమెను వాడుకొని డబ్బులు సంపాదించారు. పైగా ఆమెకు ఒక్క అవార్డు గానీ, మంచి పేరు గాని తెచ్చేందుకు ప్రయత్నించలేదు. ఆమె రాసిన లేఖ కూడా నెట్టింటా ప్రత్యక్షమైంది. నిజానికి సిల్క్ స్మితకి ఎవరూ పెద్దగా మర్యాద ఇచ్చేవారు కాదు. కానీ సినిమా అనే మార్కెట్లో అంగడి సరుకుగా మార్చి సొమ్ము చేసుకున్నవారు ఎందరో ఉన్నారు. నిజానికి ఆమె ఒక్క పాటలో నటిస్తే చాలు ఎవరి సినిమా అయినా సరే సూపర్ హిట్ అయ్యేది. 40 ఏళ్ల క్రితం సిల్క్ స్మిత సగం కొరికిన యాపిల్‌ను ఒక వ్యక్తి రూ.26,000 వెచ్చించి కొనుగోలు చేశాడు. అంటే ఈ ముద్దుగుమ్మపై ప్రజలకు ఎంత పిచ్చి ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ప్రజల్లో అంత పేరు నా చివరికి ఆమె దిక్కుమొక్కులేని అనాధగా చచ్చిపోయింది. అందుకే ఆమెకు జరిగిన అన్యాయం పగవాడికి కూడా జరగకూడదని అంటుంటారు.

గతంలోకి వెళ్లి చూస్తే.. తెలుగులో సూపర్‌హిట్ మూవీ జస్టిస్ చౌదరి(1982) 1983లో తమిళంలోకి ‘నీతిపతి’గా రీమేక్ చేశారు. కాగా ఇందులో సిల్క్ స్మిత లేకపోవడంతో సినిమా ప్రివ్యూ సమయంలో బయ్యర్లు గోలగోల చేశారట. సిల్క్ లేని సినిమా చూసేందుకు ఎవరు వస్తారు? మేం కూడా కొనుగోలు చేయమని శివాజీ గణేషన్, మూవీ నిర్మాత ముఖం మీద చెప్పేశారట. దీంతో చేసేది లేక ఆ సినీ నిర్మాత అప్పటికప్పుడు సిల్క్ డేట్స్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టి ఈ చివరికి అతి కష్టం మీద 15 రోజుల తరువాత డేట్స్ పొందాడట.

తర్వాత ఆమెతో బీచ్ లో షూట్ చేశారు. “ముత్తెడుక్కుమ్ ఆశయిలే.. కట్టుమారం యేరయిలే” అంటూ సాగే ఈ పాట మత్తెక్కించేలా ఉండటంతో బయ్యర్లు ఖుషి అయ్యారట. అయితే ప్రజల్లో ఇంత క్రేజ్‌ ఉన్నప్పటికీ ఆమెను నమ్ముకున్న వారు మోసం చేశారు. కుటుంబ సభ్యులు, దర్శక నిర్మాతలు ఆమెను అవసరం ఉన్నంత వరకు వాడుకొని తర్వాత ముఖం చాటేశారు. దాంతో 36 ఏళ్ల వయసులోనే ఈమెకు నిండు నూరేళ్లు నిండాయి. ఎవరో బాబు తనని మోసం చేశారని ఈ ముద్దుగుమ్మ వాపోయింది కానీ అతడు ఎవడు అనేది తెలిసినా చాలా మంది బయట పెట్టలేదు

ఏలూరు పక్కన కొవ్వలిలో ఈ తార జన్మించింది. నాలుగో తరగతితో చదువు మానేసి.. ఇష్టం లేని పెళ్ళి వద్దనుకొని సినిమాలపై పిచ్చితో చెన్నై వచ్చింది. ఈ ముద్దుగుమ్మ అసలు పేరు వడ్లపట్ల విజయలక్ష్మి. అనతి కాలంలోనే ఎంతో పేరు తెచ్చుకున్న ఈ హాట్ యాక్ట్రెస్ ఒకడిని నమ్ముకుని దారుణంగా మోసపోయింది. ఆ ఒకరు ఎవరనేది సిల్క్ స్మిత తన సూసైడ్ నోట్‌లో కూడా రాయలేదు. ఏదేమైనా ఎన్నో ఆశలతో సినిమా రంగంలో అడుగుపెట్టి కావాల్సిన దానికంటే ఎక్కువ స్టార్డమ్‌ తెచ్చుకొని చివరికి ఆమె జీవితం అర్ధాంతరంగా ముగిసిపోవడం ఇప్పటికీ అందర్నీ కంటతడి పెట్టిస్తుంది.