ప్రముఖ నటుడు కమల్ హాసన్ చిన్నతనంలోనే సినిమాలోకి అడుగు పెట్టాడు. ఐదేళ్ల వయసు నుంచే నటించడం మొదలు పెట్టిన కమల్ హాసన్ తర్వాత అన్ని రకాల పాత్రలో యాక్ట్ చేసి తన సత్తా ఏంటో చాటాడు. సాగర సంగమం సినిమాలో ఆయన నటనకు ప్రతి ఒక్కరూ ముగ్ధులయ్యారు అంటే అతిశయోక్తి కాదు. ఆయన తన ఒక్కొక్క సినిమాల్లో ఒక్కొక్క వైవిధ్యాన్ని చూపించగలడు. దశావతారం సినిమాలో పది పాత్రలను ఒకేసారి వేసి ఎలా ఆశ్చర్యపరిచాడు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ టాలెంటెడ్ హీరో భారతదేశవ్యాప్తంగా అన్ని భాషలలోనూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇటీవల ఈ లోక నాయకుడు హీరోగా నటించిన చిత్రం ‘విక్రమ్’. కమల్ సొంత బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం రికార్డులు బ్రేక్ చేసింది. సినిమాల్లో హిట్స్ కొడుతూనే కమల్ రాజకీయాల్లో కూడా బిజీ అయిపోయారు. అంతేకాకుండా బిగ్ బాస్ షోకి హోస్ట్ గా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కమల్ ఇండియన్-2 సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆ తరువాత మలయాళ దర్శకుడుతో ఒక సినిమా, అలానే విక్రమ్ పార్ట్ 2 సినిమాలో నటించడానికి సిద్ధం అవుతున్నారు.
ఇక మన జక్కన రాజమౌళి, కమల్ హాసన్ కలిసి సినిమా తీయాలని అనుకుంటున్నారనే ప్రచారం జరుగుతుంది . రాజమౌళి సినిమాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా లెవెల్ ప్రేక్షకులను మెప్పించేలా ఉంటాయి జక్కన్న సినిమాలు. ఇక కమల్ హాసన్ నటన గురించి మనందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబోలో సినిమా అంటే ఎవరూ ఊహించని రీతిలో ఉంటుంది.
రాజమౌళికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్‌తో సినిమా చేయాలనే కోరిక ఉందని చాలా ఇంటర్వ్యూలలో చెప్పారు. ఇక ఇటీవలే రాజమౌళి, కమలహాసన్ కలుసుకొని కొన్ని విషయాల గురించి చర్చించుకున్నట్లు సమాచారం. దాంతో కమల్, రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా వస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.