ఎంపీలకు కూడా జగన్ షాక్..సీట్లు పాయే.!

నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ గెలిచి అధికారం దక్కించుకోవాలనే దిశగా జగన్ పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ సారి కూడా అధికారంలోకి వస్తే..మరో 30 ఏళ్ల పాటు అధికారంలో ఉండవచ్చు అనేది జగన్ ప్లాన్. అందుకే జగన్ ఆచి తూచి అడుగులేస్తున్నారు. గెలవడం కోసం అవసరమైతే కొందరు ఎమ్మెల్యేలని సైతం పక్కన పెట్టడానికి జగన్ వెనుకాడటం లేదు. పనితీరు బాగోని ఎమ్మెల్యేలకు మళ్ళీ సీట్లు ఇస్తే వైసీపే దెబ్బతినడం ఖాయం.

అందుకే కొందరిని మార్చి..ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారు. అయితే ఎమ్మెల్యే సీట్లు ఎంత ముఖ్యమో ఎంపీ సీట్లు కూడా అంతే ముఖ్యం. అందుకే జగన్ ఎంపీ సీట్లలో కూడా మార్పులు చేయాలని చూస్తున్నారు. గత ఎన్నికల్లో జగన్ మాటలు విని ప్రజలు వైసీపీకి 22 మంది ఎంపీలని ఇచ్చారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని జగన్ చెప్పడతోనే ప్రజలు వైసీపీని గెలిపించారు. కానీ 22 మంది గెలిచిన ప్రయోజనం లేదు. రాష్ట్రం కోసం పోరాడేది లేదు. ఇంకా విచిత్రం ఏంటంటే..కొందరు ఎంపీలు అనే సంగతి చాలామంది ప్రజలకు తెలియదు.

తమ ఎంపీ ఎవరనేది సొంత పార్లమెంట్ ప్రజలకు అవగాహన లేదు. అంటే వైసీపీ ఎంపీల పనితీరు అలా ఉంది. కానీ అటు టీడీపీలో ముగ్గురు ఎంపీలు ఉన్నా సరే బాగా హైలైట్ అవుతున్నారు. అలా వైసీపీ ఎంపీలు హైలైట్ అవ్వడం లేదు. మళ్ళీ అలాంటివారికి సీట్లు ఇస్తే ఓడిపోవడం ఖాయమని పలు సర్వేలు చెబుతున్నాయి. అయితే కొంతమంది ఎంపీలని ఈ సారి ఎమ్మెల్యేలుగా బరిలో దించుతారని తెలుస్తోంది.

ఇక కొందరికి సీట్లు దక్కడం కష్టమని సమాచారం. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో కొంతమంది ఎంపీ సీట్లు పోవడం గ్యారెంటీ అని తెలుస్తోంది. మొత్తానికి ఎంపీలని కూడా జగన్ మార్చేయనున్నారు.