`వాల్తేరు వీర‌య్య‌` చూడ‌గానే చిరు రియాక్ష‌న్ ఏంటో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి వచ్చే ఏడాది సంక్రాంతి బ‌రిలో `వాల్తేరు వీరయ్య` సినిమాతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. బాబీ కొల్లి దర్శకత్వం వహింస్తున్న ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. రవితేజ కీలక పాత్రలో కనిపించనున్నాడు. కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్ర‌సాద్ స్వ‌రాలు అందిస్తున్నాడు. విశాఖపట్టణం బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ మాస్ ఎంట‌ర్టైన‌ర్ లో మత్స్య కారులకు నాయకుడిగా వాల్తేరు వీర‌య్య పాత్ర‌లో చిరంజీవి క‌నిపించ‌బోతున్నాడు. దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం జ‌న‌వ‌రి 13న రిలీజ్ కాబోతోంది.

ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు. అయితే తాజాగా డైరెక్ట‌ర్ బాబీ ఈ సినిమా చూసిన త‌ర్వాత‌ చిరు రియాక్ష‌న్ ఏంటో వివ‌రించారు. రెండు రోజుల క్రిత‌మే చిరంజీవి వాల్తేరు వీర‌య్యను చూశార‌ట‌. సినిమా కంప్లీట్ అయిన త‌ర్వాత ఆయ‌న ఒకే ఒక్క మాట అన్నారు. ఇది డ‌బుల్ బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంద‌ని చిరు ఎంతో న‌మ్మ‌కంగా చెప్పార‌ట‌. దాంతో త‌న ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయ‌ని బాబీ తాజా భేటీలో పేర్కొన్నారు. మ‌రి చిరు జోస్యం వాల్తేరు వీర‌య్య విష‌యంలో నిజ‌మ‌వుతుందా..లేదా.. అన్న‌ది చూడాలి.