పొత్తు కుదిరితే.. విజ‌య‌వాడ‌లో రెండు స్థానాలు జ‌న‌సేన‌కే..?

టీడీపీ-జ‌న‌సేన పొత్తు కుదిరితే.. రాష్ట్రంలో 30-40 స్థానాలు ఇస్తార‌నేప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక‌, మ‌రికొంద రు అంటే.. టీడీపీ నాయ‌కులు మాత్రం 25-30 స్థానాలు ఇవ్వొచ్చ‌ని చెబుతున్నారు. అయితే.. ఈ మొత్తం వ్య‌వ‌హారం ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లోపొత్తులు ఖాయ‌మ‌ని మాత్రం అంటున్నారు. ఇదే జ‌రిగితే.. కీల‌క‌మైన విజ‌య‌వాడ‌లో టీడీపీ నేత‌ల కు మార్పులు త‌ప్ప‌వ‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు.

విజ‌య‌వాడ‌లో మొత్తం మూడు నియోజ‌క‌వ‌ర్గాలు వున్నాయి. వీటిలో రెండు చోట్ల కార్య‌క‌ర్త‌లు+నాయ‌కుల బ‌లం టీడీపీకి మెండుగా ఉంది. అదేస‌మ‌యంలో మ‌రో నియోజ‌క‌వ‌ర్గంలో న‌య‌కులు ఉన్నారు కానీ, కార్య‌క‌ర్త‌లు క‌రువ‌య్యారు. దీంతో తూర్పు, సెంట్ర‌ల్‌నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుస్తున్న టీడీపీ.. ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గానికి వ‌చ్చేస‌రికి మాత్రం బోణీ కొట్ట‌లేక పోతోంది. పొత్తు ఎవ‌రితో పెట్టుకున్నా.. టీడీపీ ఓట‌మి ఖాయం. అనే మాట త‌ర‌చుగా వినిపిస్తూనే ఉంటుంది.

ఇక‌, జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకుంటే.. ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గాన్ని పువ్వుల్లో పెట్టి ఆపార్టీకి అప్పగించేస్తార‌ని అంటున్నారు. ఇక్క‌డ నుంచి యువ నాయ‌కుడు పోతిన మ‌హేష్‌.. జ‌న‌సేన‌ త‌ర‌ఫున రంగంలోకి దిగితే.. వైసీపీకి గ‌ట్టి పోటీ త‌ప్ప‌దు. గ‌త ఎన్నిక‌ల్లో ఎవ‌రికివారు గా పోటీ చేస్తేనే బ‌లంగా పోరాడిన జ‌న‌సేన పార్టీ.. ఇప్పుడు పొత్తులో క‌నుక టికెట్ ద‌క్కితే గెలుపు గుర్రం ఎక్క‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.

What are the chances that Jana Sena and TDP will unite and form the government in Andhra Pradesh? - Quora

ఇక‌, జ‌న‌సేన‌కు అప్ప‌గించేందుకు అవ‌కాశం ఉన్న మ‌రోనియోజ‌క‌వ‌ర్గం తూర్పు. వాస్త‌వానికి ఇక్క‌డ గ‌ద్దె రామ్మోహ‌న్‌.. వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్నారు. అయినా స‌రే.. ఈ సారి అవ‌స‌రం రీత్యా గ‌ద్దెను గ‌న్న‌వ‌రం నుంచి పోటీకి నిల‌బెడ‌తార‌ని తెలుస్తోంది. ఇక‌, ఈ తూర్పు టికెట్‌ను జ‌న‌సేన‌కు కేటాయిస్తార‌ని తెలుస్తోంది. ఇక, వైసీపీలో ఉన్న ప్ర‌స్తుత నేత య‌ల‌మంచిలి ర‌వి.. క‌నుక పార్టీ మారితే ఆయ‌న‌కు ఈ టికెట్‌ద‌క్క‌డం ఖాయమ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. సో.. ఇదీ విజ‌య‌వాడలో ప‌రిస్థితి.