హైపర్ ఆది నిర్ణయంతో తలలు పట్టుకుంటున్న జబర్దస్త్ యాజమాన్యం..?

2013 నుంచి ఈటీవీలో ప్రసారం అవుతున్న కామెడీ షో జబర్దస్త్‌కి ఇప్పుడు ఎండ్‌ కార్డు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ షో నుంచి కీలకమైన హాస్యనటులందరూ వెళ్లిపోయారు. ఉన్నవాళ్లు కూడా కామెడీ చేయకుండా పేలవమైన పర్ఫామెన్స్ తో స్కిట్స్ కానిచేస్తున్నారు. వీరులో ఒక్క హైపర్ ఆది మాత్రమే బాగా నవ్వించగలుగుతున్నాడు. అయితే ఇప్పుడు అతను కూడా షో నుంచి బయటికి వచ్చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కమెడియన్ ఆల్రెడీ జబర్దస్త్ యాజమాన్యంతో ఈ విషయమై చర్చలు కూడా జరుపుతున్నట్లు సమాచారం.

దీనికి కారణం జబర్దస్త్ షో కోసమే ఆది చాలా సమయం కేటాయించాల్సి వస్తోందట. స్కిట్స్ రాయడం, స్కిట్స్ రిహార్సల్స్ చేయడం, అలానే స్కిట్స్ చేయడానికే ఆది సమయమంతా అయిపోతుందట. అంతేకాదు, జబర్దస్త్ వల్ల ఇతర కమిట్మెంట్స్ కి ఎక్కువ టైమ్‌ కూడా ఇవ్వలేకపోతున్నాడట. ముఖ్యంగా సినిమాలలో కాల్ షీట్స్‌ అడ్జస్ట్ చేయడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడట. అందుకే జబర్దస్త్ వదిలేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉండగా.. గతంలో హైపర్ ఆది జబర్దస్త్ నుంచి వెళ్లిపోయి మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు. అదేవిధంగా ఇప్పుడు కూడా రియంట్రి ఇచ్చే అవకాశం ఉండొచ్చని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నాటికి జబర్దస్త్ ప్రారంభించి 10 సంవత్సరాలు నిండుతాయి. ఇదివరకు ఆది జబర్దస్త్ లో ఉండి తర్వాత దాన్నుంచి బయటికి వచ్చేయవచ్చు అని కూడా టాక్ నడుస్తోంది. అయితే హైపర్ ఆది పంచుల వల్లే ఇప్పటికీ కొందరు జబర్దస్త్ చూస్తున్నారు. అతడు పోతే ఈ షోని చూసేవారి సంఖ్య దారుణంగా తగ్గిపోయే అవకాశం ఉంది. ఈటీవీ ఛానల్‌తో పాటు యూట్యూబ్‌, ఫేస్‌బుక్ ద్వారా కూడా జబర్దస్త్ షో రెవిన్యూ తెచ్చిపెడుతుంది. ఆది ఎపిసోడ్స్‌ కూడా అన్ని చోట్లా లక్షల కొద్ది వ్యూస్ తో ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. సో, ఇతడు వెళ్లిపోవడం అన్ని విధాలా జబర్దస్త్ యాజమాన్యానికి మైనస్సే!