బరితెగించిన బిగ్ బాస్ బ్యూటీ…ఎంత పని చేసిందో చూశారా..!

బిగ్ బాస్ షోలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాదు.. ఆ షోలో ఉండే కంటెస్టెంట్స్ మధ్య నడిచే లవ్ ట్రాక్ మాత్రం ప్రతి సీజన్‌లోను హైలైట్ గా నిలుస్తుంది. తాజాగా ఇప్పుడు జరిగే తెలుగు బిగ్ బాస్ ఆరో సీజన్ లో కూడా లవ్ ట్రక్ ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. ఇక ఈ సీజన్‌లో లవ్ బర్డ్స్ గా శ్రీ సత్య, అర్జున్ నిలిచారు.

BiggBoss Latest Updates, Srisathya And Arjun Love Story Begin | Bigg Boss 6  Telugu: హౌస్‌లో జంటల గోల, శ్రీసత్య చుట్టూ తిరుగుతున్న అర్జున్, ఆరోహి -  సూర్య మధ్య గొడవ, అతనికి ...

అర్జున్ హౌస్ లోకి వచ్చినప్పటి నుంచి తన గేమ్ మర్చిపోయి శ్రీ సత్య చుట్టూ తిరుగుతూ ప్రేమలో పడిపోయిన అర్జున్ కేవలం 7వ వారమే బయటికి వచ్చేసాడు. ఆ హౌస్ లో ఉన్నంతసేపు శ్రీ సత్య వెంటే తిరిగిన అర్జున్ బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక మాత్రం అర్జున్ ప్లేట్ ఫిరాయించి నట్లు కనిపిస్తుంది. అదే షోలో మరో కంటెస్టెంట్ అయిన వాసంతి కృష్ణన్‌తో గత కొద్దిరోజులుగా షికార్లు చేస్తున్న అర్జున్ తాజాగా ఓ షో కి వెళ్ళాడు.

అప్పుడు షో కు వాసంతి కూడా వచ్చింది. అయితే ఆ షోలో ఓ గేమ్ టాస్క్ లో భాగంగా వాసంతి కాకరకాయ జ్యూస్ తాగాల్సి రాగా, అప్పుడు తను తాగకుండా ఆ జ్యూస్ ను అర్జున్‌కు తాగమని ఇస్తుంది. అప్పుడు వాసంతి కోసం అర్జున్ కాకరకాయ జ్యూస్ తాగేస్తాడు. తనకోసం ఆ జ్యూస్ తాగిన అర్జున్ కి వాసంతి వెంటనే అతనికి కిస్ ఇచ్చేస్తుంది. ఇక దీంతో అర్జున్ హౌస్ లో శ్రీ సత్యతో ఎంజాయ్ చేసి బయటకు వచ్చాక వాసంతితో తన రిలేషన్ ను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం ఈ షోకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.