కేకపెట్టిస్తున్న బాలయ్య రొమాంటిక్ లుక్.. ‘సుగుణ సుందరి’ తో శృతి మించిపోయాడుగా..!!

నందమూరి నట సింహం బాలయ్య ప్రజెంట్ నటిస్తున్న చిత్రం వీర సింహారెడ్డి. ఆయన కెరియర్ లోనే 107వ సినిమాగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను డైరెక్టర్ చూస్తున్నాడు మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని . ఇదివరకే క్రాక్ అనే సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ డైరెక్టర్ త్వరలోనే బాలయ్యతో వీరసింహారెడ్డి తో మరో బ్లాక్ బస్టర్ హీట్ అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కాగా బాలయ్య కూడా అఖండ తర్వాత భారీ సక్సెస్ అందుకోవడానికి సిద్ధమయ్యాడు .

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మొత్తం షూటింగ్ మొత్తం పూర్తయినట్లు తెలుస్తుంది . కాగా సంక్రాంతి కానుకగా ఈ సినిమా ఎక్కువ థియేటర్స్ లో జనవరి 12న గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోని సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ జై బాలయ్య అంటూ ఓ సాంగ్ తో దుమ్ము లేపేసాడు నందమూరి బాలకృష్ణ . కాగా ప్రస్తుతం సెకండ్ సింగిల్ రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధంగా ఉన్నారు .

దీనిపై అఫీషియల్ ప్రకటన కొద్దిసేపటి క్రితమే ఇచ్చారు . ఫస్ట్ సింగిల్ లో అభిమానులకు ఇష్టమైన జై బాలయ్య అనే టైటిల్ పెట్టగా .. సెకండ్ సింగిల్ లో మాత్రం నందమూరి అభిమానులు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న రొమాంటిక్ యాంగిల్ ని బయటకు తీసుకొచ్చాడు గోపీచంద్ మల్లినేని. “సుగుణసుందరి” అంటూ సాగే ఈ పాట కి సంబంధించిన పోస్టర్ని రిలీజ్ చేస్తూ డిసెంబర్ 15న ఈ పాటని రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

దీనికి సంబంధించిన పోస్టర్ లో శృతిహాసన్ బాలయ్య మహా రొమాంటిక్ గా ఉండడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అంతేకాదు ఈ వయసులోనూ బాలయ్య యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ రొమాంటిక్ పాటల్లో ఇరగదీస్తున్నాడు అంటూ నందమూరి ఫ్యాన్స్ అపోస్టర్ ని వైరల్ చేస్తున్నారు . అంతేకాదు పోస్టర్ ఆధారంగా చేసుకుని చూసినట్లయితే శృతి – బాలయ్య కెమిస్ట్రీ అదిరిపోయినట్లు తెలుస్తుంది. మరి చూడాలి పూర్తి పాట ఎలా ఉంటుందో . సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమా గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ కానుంది . ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుంది.

 

 

View this post on Instagram

 

A post shared by Mythri Movie Makers (@mythriofficial)