2022, ఏప్రిల్ నెలలో పెళ్లి చేసుకున్న అలియా భట్, రణ్‌బీర్ కపూర్ నవంబర్ 6న ఓ పండంటి బిడ్డకు తల్లిదండ్రులయ్యారు. కొన్ని రోజుల తర్వాత, తమ కుమార్తెకు రాహా అని నామకరణం చేసినట్లు తెలిపారు. అలాగే తమ బిడ్డ ఫేస్ కనిపించకుండా ఒక ఫొటో కూడా షేర్ చేశారు. తర్వాత అలియా భట్ కొన్ని క్యూట్ ఫొటోలు పంచుకుంటూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. కాగా తాజాగా ఈ ముద్దుగుమ్మ బాత్రూమ్‌లో చేసిన ఫొటోషూట్‌ను పంచుకుంది.
ఆదివారం ఉదయం సూర్యరశ్మిని ఆస్వాదిస్తూ తన బాత్రూమ్‌లో సెల్ఫీలు తీసుకుంది. వాటిని తన అభిమానుల కోసం ఇన్‌స్టా పోస్ట్‌లో షేర్ చేసింది. ఈ ఫొటోలలో అలియా చాలా క్యూట్‌గా కనిపించి అందరి హృదయాలను దోచేసింది. ఈ పోస్ట్‌కి.. ‘ఆదివారం ఉదయం నా బాత్రూమ్‌లో కొంత గొప్ప కాంతిని ఆస్వాదిస్తున్నా. ఎలాంటి లక్ష్యం లేకుండా ఫొటోషూట్ చేస్తున్నా. హ్యాపీ సండే” అని అలియా భట్ ఒక క్యాప్షన్ జోడించింది. అలియా భట్ ప్రస్తుతం రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ, హార్ట్ ఆఫ్ స్టోన్, జీ లే జరా సినిమాల్లో నటిస్తోంది. పెళ్లయి తల్లి అయిన తర్వాత కూడా ఆమె సినిమాలలో యథావిధిగా కొనసాగుతుండటం ఆమె డెడికేషన్, యాక్టింగ్ పట్ల ఉన్న ప్రేమకు నిదర్శనం అని చెప్పొచ్చు.
అలియా భట్ తల్లయిన తర్వాత కూడా కొంచెం కూడా అందం కోల్పోకుండా మరింత అందంగా తయారయ్యింది. ఫిట్నెస్ కూడా బాగానే మెయింటైన్ చేస్తూ ఆశ్చర్యపరుస్తోందీ ముద్దుగుమ్మ. ఈ ఆర్ఆర్ఆర్ హీరోయిన్ సి-సెక్షన్ డెలివరీ చేయించుకుంది. ఇప్పటివరకైతే తన కూతురి ఫొటోలు షేర్ చేయని అలియా త్వరలో షేర్ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.