షాకింగ్: ఎవరు ఊహించని కథతో వస్తున్న రామ్ చరణ్.. బాక్స్ బద్దలు అవ్వాల్సిందే..!

టాలీవుడ్ క్రేజీ దర్శకుడు సుకుమార్ కాంపౌండ్ నుంచి వచ్చి ఉప్పెన సినిమాతో హిట్ కొట్టాడు దర్శకుడు బుచ్చిబాబు సనా. త‌న మొదటి సినిమాతోనే సెన్సేషనల్ హిట్ ఇచ్చిన ఈ దర్శకుడు.. ఆ సినిమా వచ్చిన‌ రెండు సంవత్సరాలకు రామ్ చరణ్ తో బుచ్చిబాబు ఓ సినిమా ప్రకటించాడు.. నిజానికి ఎన్టీఆర్ హీరోగా బుచ్చిబాబు ఓ సినిమా చేయబోతున్నాడని వార్తలు కూడా బయటకు వచ్చాయి. బుచ్చిబాబు కూడా ఎన్టీఆర్‌కు కథ చెప్పి సినిమా ఓకే చేపిచ్చుకున్నాడని టాక్ కూడా నడిచింది.

కానీ ఎన్టీఆర్ కమిట్ అయిన కొరటాల సినిమా ఇంకా షూటింగ్ మొదలవ్వకపోవడంతో బుచ్చిబాబు సినిమా క్యాన్సిల్ అయిందని తెలుస్తుంది. ఆ తర్వాత బుచ్చిబాబు, రామ్ చరణ్ తో తన తర్వాత సినిమాను ప్రకటించాడు. ఈ సినిమాను కూడా వచ్చే నెల నుంచి షూటింగ్ మొదలుకానుందని తెలుస్తుంది. అయితే ఇప్పుడు చరణ్ తో చేయబోయే సినిమా కథను ఎన్టీఆర్ కోసం రాసిన కథని ఇప్పుడు బుచ్చిబాబు చరణ్‌తో చేస్తున్నాడని టాక్ నడుస్తుంది.

ram charan, RC16: Buchibabu pan india movie with ram charan.. sometimes a  rebellion is needed! – ram charan next is a pan india movie with buchi babu  sana

అయితే ఆ సినిమాను స్పోర్ట్స్ డ్రామా అని దానికోసం శారీరకంగా కూడా మార్పులు అవసరమవుతాయట. ఈ సినిమాలో హీరో తన ఆటల్లో కాళ్లు రెండు పోగొట్టుకుని అంగవైకల్యం పొందిన వ్యక్తిగా కనిపిస్తాడట. ఆ తర్వాత అతను ఎలా ముందుకు వెళ్లాడు తన గోల్‌ ఎలా రీచ్ అయ్యాడు అనేది సినిమా కథ. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కబోతుంది.

uppena director, Buchi Babu Sana: మళ్లీ మెగా కాంపౌండ్‌లోకి బుచ్చి బాబు! -  uppena director buchi babu sana next movie with mega hero - Samayam Telugu

ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే మరి బుచ్చిబాబు ఎన్టీఆర్ తో అనుకున్న క‌థ‌ని రామ్ చరణ్ తో తీసి ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడో చూడాలి. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను వచ్చే సమ్మర్ కు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని శంకర్ ప్రయత్నాలు చేస్తున్నాడు.