టాలీవుడ్ తెలుగు హీరో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండడమే కాకుండా రాజకీయంగా కూడా తన హవా కొనసాగించాలని ఎంతో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పర్యటనలో భాగంగా ఎన్నికల ప్రచారం చేసేందుకు ఒక వారాహి వాహనాన్ని సిద్ధం చేసుకున్నారు. అయితే ఈ వాహనం రంగు ఇతర విషయాలు నిబంధనలు విరుద్ధంగా ఉందని ట్రోలింగ్ జరగడమే కాకుండా ప్రతిరోజు వివాదంగా మారుతోంది. 2024 ఎన్నికల ప్రచారం కోసం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి ఒక ప్రచార రథాన్ని సిద్ధం చేసుకున్నారు.
అందుకు వారాహి అని పేరు కూడా పెట్టారు. ఈ వెహికల్ అత్యాధునిక టెక్నాలజీతో మెరుగైన హంగులతో వాహనాన్ని సిద్ధం చేశారు. ఈ వాహనానికి వాడిన రంగు కూడా వివాదాస్పందమైనది.ముఖ్యంగా మిలటరీ వాహనాలకు ఉపయోగించే అలివ్ గ్రీన్ రంగును వాడడంపై ఎంతోమంది అభ్యంతరాలు తెలియజేశారు. ఇక పవన్ కళ్యాణ్ బాడీగార్డులు కూడా గతంలో ఆర్మీలో పనిచేసిన వ్యక్తులు ఉన్నట్లుగా సమాచారం. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ అధికారులు కూడా ఈ వెహికల్ రిజిస్ట్రేషన్ చేయనట్లుగా తెలుస్తోంది.
1989 చాప్టర్ 121 ప్రకారం ఇండియన్ డిఫెన్స్ విభాగం తప్ప మరెవరు కూడా ఇలాంటి ఆలీవ్ గ్రీన్ రంగును వాడకూడదని ప్రభుత్వం గతంలో నివేదికలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. లారీ చార్జీస్ ను బస్సు గా మార్చడం వాహనం ఎత్తు ఎక్కువగా ఉండడం ఇలా ఈ వెహికల్స్ కు అన్నీ కూడా మైనస్ గా ఉన్నాయి. అంతేకాకుండా వాడాల్సిన వాహన టైర్లను వాడకుండా ఇతర వాటిని వాడడంతో వారాహి వాహనంపై పలు రకాలుగా విమర్శలు ఎదురవుతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ దీనికోసం ఒక బుల్లెట్ ప్రూఫ్ వంటి వాటిగా తయారు చేయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇందుకోసం దాదాపుగా కోటి రూపాయలు ఖర్చుపెట్టినట్లుగా సమాచారం.