రవితేజ ఏజ్‌పై రాఘవేంద్రరావు సెటైర్‌.. గ‌ట్టిగానే పేలిందిగా!

మాస్‌ మహారాజా రవితేజ ఇటీవల `ధ‌మాకా` మూవీతో ప్రేక్షకులను పలకరించి బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. డిసెంబర్ 23న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేస్తోంది.

ఈ నేపథ్యంలోనే మేకర్స్‌ తాజాగా `మాస్ మీట్‌` పేరుతో హైదరాబాదులోని జేఆర్సీ కన్వెన్షన్ లో సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కు సీనియర్ దరక్షకుడు రాఘవేందర్రావు గెస్ట్ గా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రవితేజ ఏజ్ పై అదిరిపోయే సెటైర్ పేల్చారు. అది గ‌ట్టిగానే పేలింది. రాఘవేందర్రావు మాట్లాడుతూ.. `ఐదు వేల సంవత్సరాల క్రితం కృష్ణుడు ఫ్లూట్ ఊదితే 16 వేల మంది గోపికలు వచ్చారు. పీపుల్ మీడియా వారు కూడా అలాంటి ఫ్లూట్ ఏదో ఊదే ఉంటారు .. అందుకే డబ్బులే డబ్బులు.

ఆ ఫ్లూట్ వాళ్ల ఆఫీసులో ఉందని అనుకుంటున్నాను. ఆ ఫ్లూట్ ను దొంగ‌లించి తీసుకురావలసిన బాధ్యత శ్రీలీలదే. ఆ ఫ్లూట్ ను ఒకసారి మా ఆర్కే ఆఫీసులో కూడా ఊది చూడాలి. ఇక రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. నా చిన్నప్పటి నుంచి ఆయన అలాగే ఉన్నాడు` అంటూ నవ్వులు పూయించారు. రవితేజ ఏజ్ మీద రాఘవేందర్రావు వేసిన సెటైర్ తో.. అక్క‌డి ఉన్న‌వారు అంతా తెగ‌ నవ్వుకున్నారు.