కర్నూలు సిటీ వైసీపీలో రచ్చ..టీడీపీలో భరత్‌ ఫిక్స్?

కర్నూలు సిటీ నియోజకవర్గం గతంలో కాంగ్రెస్ కంచుకోట..ఇప్పుడు వైసీపీ అడ్డా. గతంలో టీడీపీ ఇక్కడ రెండుసార్లు, సి‌పి‌ఎం రెండుసార్లు గెలిచింది. ఎక్కువసార్లు కాంగ్రెస్ గెలిచింది. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ విజయం సాధిస్తూ వస్తుంది. అయితే వైసీపీ భారీ విజయాలు ఏమి సాధించడం లేదు. 2014 ఎన్నికల్లో కేవలం 3479 ఓట్ల తేడాతో టీడీపీపై వైసీపీ గెలిచింది.

జగన్ వేవ్ ఉన్న 2019 ఎన్నికల్లో సైతం 5353 ఓట్ల తేడాతో వైసీపీ గెలిచింది. అంటే రెండు ఎన్నికల్లో టీడీపీ గట్టి పోటీ ఇచ్చింది. 2014లో టీడీపీ నుంచి టీజీ వెంకటేష్ పోటీ చేసి ఓడిపోగా, 2019లో ఆయన కుమారుడు భరత్ పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఎన్నికల తర్వాత వెంకటేష్ బీజేపీలోకి వెళ్ళగా, భరత్ మాత్రం టీడీపీలోనే కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆయనే ఇంచార్జ్ గా ఉన్నారు. అయితే ఓడిపోయిన మొదట్లో భరత్ పెద్దగా యాక్టివ్ గా పనిచేయలేదు. దీని వల్ల సిటీలో టీడీపీ వెనుకబడింది.

కానీ ఆ మధ్య చంద్రబాబు నియోజకవర్గాల వారీగా పెట్టిన సమావేశాల్లో భరత్‌తో మాట్లాడి..సరిగా పనిచేయకపోతే తప్పించేస్తానని చెప్పారు. దీంతో భరత్ దూకుడుగా పనిచేస్తున్నారు. ఇటీవల కర్నూలులో జరిగిన చంద్రబాబు రోడ్ షోతో సిటీలో టీడీపీకి ఊపు వచ్చింది. ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని యాక్టివ్ చేస్తూ..వైసీపీ కార్యకర్తలని టీడీపీ చేరుస్తున్నారు. అయితే దాదాపు సిటీ సీటు భరత్‌కే దక్కేలా ఉంది.

అయితే వైసీపీలో ఆధిపత్య పోరు ఉంది. ఎమ్మెల్యే హఫీజ్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిల మధ్య పోరు నడుస్తోంది..నెక్స్ట్ ఒకరికి సీటు ఇస్తే మరొకరు సహకరించే పరిస్తితి లేదు..దీంతో వైసీపీకే నష్టం జరిగేలా ఉంది.