ప్ర‌భాస్ కు ఇష్ట‌మైన ఇద్ద‌రే ఇద్ద‌రు ద‌ర్శ‌కులు ఎవ‌రో తెలుసా?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ఇటీవ‌ల న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న టాక్ షో `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే`కు గెస్ట్ గా హాజ‌రు అయిన సంగ‌తి తెలిసిందే. ఈ ఎపిసోడ్ ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూసిన ఫ్యాన్స్ ఎదురు చూపులకు తెరపడింది. ప్ర‌భాస్ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా చేసిన ఆహా టీమ్‌.. ఫ‌స్ట్ పార్ట్ ను గుర‌వారం రాత్రి 9 గంటలకు రిలీజ్ చేశారు.

ఈ ఎపిసోడ్ మొత్తం ఎంతో సరదాగా సాగిపోయింది. వృత్తిప‌ర‌మైన విష‌యాలే కాకుండా పెళ్లి అండ్ రేలషన్‌షిప్ గురించి ప్ర‌భాస్ ను ప్ర‌శ్న‌లు అడిగి బాల‌య్య‌ ఒక ఆట ఆదుకున్నాడు. ఇక ఈ క్ర‌మంలోనే ఇండ‌స్ట్రీలో ఇష్ట‌మైన ద‌ర్శ‌కులు ఎవ‌రు అంటూ బాల‌య్య ప్ర‌శ్నించాడు.

 

దివంగ‌త దర్శకుడు బాపు, అలాగే ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మణిరత్నం అంటే ఎంతో ఇష్టమని.. వారి సినిమాలను అస్సలు మిస్ అవ్వకుండా చూస్తానని ప్రభాస్ పేర్కొన్నాడు. మణిరత్నం దర్శకత్వంలో వర్క్ చేయడానికి ఎప్పుడైనా సిద్ధమే అంటూ ఓపెన్ గానే ప్రభాస్ చెప్పేశాడు. మరి ప్రభాస్ కు మణిరత్నం దర్శకత్వంలో నటించే అవకాశం భవిష్యత్తులో వస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.