ప్రభాస్ త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడు.. సీక్రెట్ లీక్ చేసిన చ‌ర‌ణ్‌!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ త్వ‌ర‌లోనే ఓ గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడ‌ట‌. ఈ సీక్రెట్ ను లీక్ చేశాడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహా వేదిక‌గా ప్ర‌సారం అవుతున్న `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే` టాక్ షోకు న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే సీజ‌న్ 2లో ఓ ఎపిసోడ్ కు గెస్ట్ గా ప్ర‌భాస్ విచ్చేశాడు. రెండు భాగాలుగా ఈ ఎపిసోడ్ ప్ర‌సారం కానుండ‌గా.. మొద‌టి పార్ట్ ఎపిసోడ్ ను ఆహా టీం నిన్న రాత్రి 9 గంటలకు రిలీజ్ చేశారు.

ప్రభాస్ చాలా కాలానికి ఇలా ఓటీటీలో కనిపించడంతో అభిమానుల దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. దీంతో ఎపిసోడ్‌ స్ట్రీమింగ్ ప్రారంభించిన వెంట‌నే అభిమానులు ఆహా యాప్ మీద ప‌డిపోయారు. ఆ దెబ్బ‌కు ఆహా యాప్ క్రాష్ అయిపోయింది. అయితే కొంత సమయానికే స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించి ఎపిసోడ్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ఈ ఎపిసోడ్ ఎంతో స‌ర‌దాగా సాగిపోయింది.

ఇక ఈ ఎపిసోడ్ లో బాల‌య్య మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కు కాల్ చేసి.. `ప్ర‌భాస్ ప్ర‌స్తుతం ఎవరితో రేలషన్‌షిప్‌లో ఉన్నాడో చెప్పు` అని అడిగాడు. చ‌ర‌ణ్ మాత్రం మొద‌ట ఏం చెప్ప‌లేదు. అయినా బాల‌య్య వ‌ద‌ల్లేదు. `ఏ అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడు. రాజులా, రెడ్డిలా, నాయుళ్ళ, చౌదరిలా, సనన్ లేదా శెట్టినా అనేది నువ్వు చెప్పాల్సిందే` అని బాలయ్య బలవంతం చేయగా రామ్ చరణ్.. ప్రభాస్ త్వరలోనే ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడు అని చెప్పి బాలకృష్ణతో కలిసి ప్రభాస్ ని కాసేపు ఓ ఆట ఆడుకున్నాడు. మొత్తానికి చ‌ర‌ణ్ కు ఫోన్ చేసి ప్ర‌భాస్ ను బాల‌య్య ఆట పాటించ‌డం ఎపిసోడ్ కే హైలెట్ గా నిలిచింది. మ‌రి ఇంత‌కీ ప్ర‌భాస్ త్వ‌ర‌గా చెప్ప‌బోయే ఆ గుడ్ న్యూస్ ఏంటీ అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.