ఆనం సీటుకు ఎసరు..అంతా జగనే అంటున్న బొత్స..!

అధికార వైసీపీలో ఊహించని విధంగా కొందరు నేతలు అసంతృప్తి గళం వినిపిస్తున్న విషయం తెలిసిందే. మొదట నుంచి వైసీపీపై తిరుగుబాటు చేసి ఎంపీ రఘురామకృష్ణంరాజు రెబల్ నేతగా మారిపోయారు. ఆయన మాత్రమే కాకుండా అప్పుడప్పుడు ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డి సైతం తమ ప్రభుత్వంపై అసంతృప్తి రాగం వినిపిస్తున్నారు. అలాగే ఇటీవల ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆ మధ్య మద్దిశెట్టి వేణుగోపాల్..అటు డీఎల్ రవీంద్రారెడ్డి లాంటి వారు తమ ప్రభుత్వం పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ఆనం మరో మెట్టు ఎక్కి..ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా..పెన్షన్లు ఇస్తే ఓట్లు పడతాయా? అని ప్రశ్నించారు. అసలు ప్రజలని ఏమని ఓట్లు అడగాలని అన్నారు. ఆ తర్వాత తన సీటుకు ఓ నేత ఎసరు పెడుతున్నారని, ఇంకా తాను వెంకటగిరి ఎమ్మెల్యేగానే ఉన్నానని, కానీ ఓ నేత నెక్స్ట్ వెంకటగిరి ఎమ్మెల్యేలని తానే అంటున్నారని చెప్పుకొచ్చారు.

ఇప్పటికే వెంకటగిరిలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పనిచేస్తున్న విషయం తెలిసిందే. నెక్స్ట్ సీటు ఈయనకే అంటున్నారు. ఇటు ఆనం నెల్లూరు సిటీ సీటు అడుగుతున్నట్లు తెలిసింది. అదే సమయంలో ఆయన టీడీపీలో చేరడానికి రెడీ అయ్యారని వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఇలా ఆనం సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేయడంపై మంత్రి బొత్స సత్యనారాయణ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.

పార్టీలో ఏమైనా ఇబ్బందులు ఉంటే అంతర్గతగా చర్చించుకోవాలి గాని..బహిరంగంగా విమర్శలు చేయకూడదని సూచించారు. అలాగే జగన్ కష్టాల మీదే అధికారంలోకి వచ్చామని చెబుతున్నారు. మొత్తానికి వైసీపీలో ఆనం వ్యవహారం హాట్ టాపిక్ అయింది. మరి ఆనం రాజకీయ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.