టీమ్ ఇండియా క్రికెట్ ప్లేయర్ రిషబ్ పంత్ కు.. యాక్సిడెంట్..!!

తాజాగా జరుగుతున్న పరిణామాలు ఒక్కొక్కరికి తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా టీం ఇండియా క్రికెటర్ గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురిఅవ్వడంతో స్వల్ప గాయాలతో సేఫ్ గా క్రికెటర్ రిషబ్ బయటపడ్డాడు అని వైద్యులు నిర్ధారించారు. అయితే వీపు , తల, కాలి భాగంలో భారీగా గాయాలు తగిలినట్లు తెలుస్తోంది. పైగా ప్రమాదం ఏమీ లేదని డాక్టర్లు సూచించారు. ఇకపోతే రిషబ్ పంత్ యాక్సిడెంట్ పై క్రికెట్ అభిమానులు పూర్తిస్థాయిలో ఆందోళన చెందుతున్నారు. త్వరగా కోలుకోవాలని కూడా కోరుకుంటున్నారు.

Rishabh Pant accident: India cricketer seriously injured after car collides  with divider on Delhi-Dehradun highway | Cricket Newsఢిల్లీ నుంచి రూర్కిలో ఉండే తన నివాసానికి వెళ్తూ ఉండగా ఈ కారు ప్రమాదానికి గురైనట్లు సమాచారం. కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొనడంతో అక్కడికక్కడే కారు దగ్ధమైందట.. మంగళూరు కోత్వాలీ ప్రాంతంలో NH 58 లో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం . అందుకు సంబంధించిన పూర్తి వివరాల విషయానికి వస్తే ఈ ప్రమాదంలో రిషబ్ పంత్ కు కాలు ఫ్రాక్చర్ అయినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్న కొంతమంది సిబ్బంది హుటాహుటిన 108 కి ఫోన్ చేయగా దగ్గరలో ఉన్నటువంటి రూర్కి సివిల్ ఆసుపత్రికి రిషబ్ పంత్ ను తరలించారు.

ఇకపోతే తాజాగా యాక్సిడెంట్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ప్రమాద స్థలం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. కిషోర్ సింగ్, స్వప్న అనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ పరిస్థితి తెలుసుకోవడం కోసం కొంతమంది సాక్షులను విచారించారు. రీలింగ్ డివైడర్ను ఢీకొని ఆ పైన కారులో మంటలు రావడం వల్ల ఆయన కారు అదుపుతప్పి బోల్తా పడిందని తెలియజేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రముఖులు కూడా ఆకాంక్షిస్తున్నారు.