నిధి అగర్వాల్.. ఈ అందాల భామ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `సవ్యసాచి` మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. `ఇస్మార్ట్ శంకర్` మూవీతో తెలుగు ప్రేక్షకులకు చేరవైంది. యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత నిధి తెలుగుతో పాటు తమిళంలోనూ సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది.
అయితే ఈమె కెరీర్ అంత జోరుగా మాత్రం సాగడం లేదు. ప్రస్తుతం తెలుగులో ఈ బ్యూటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న `హరి హర వీరమల్లు`లో నటిస్తోంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లి ఏడాది అవుతున్నా.. ఇప్పటి వరకు షూటింగ్ పూర్తి కాలేదు. ఈ మూవీ మినహా నిధి చేతిలో మరో ప్రాజెక్ట్ లేదు.
అయితే ఆఫర్లు పొందడానికి అందం, ప్రతిభ సరిపోదంటోంది నిధి. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమా రంగంలో రాణించాలన్నా, వరుస ఆఫర్లు దక్కాలన్నా అందం ప్రతిభతో పాటు అదృష్టం కూడా ఉండాలని, అదృష్టం అనేది లేకపోతే ఎవరికి ఏది కలిసి రాదని నిధి చెప్పుకొచ్చింది. సినిమా రంగంలో అదృష్టం అనేది అత్యంత కీలకమని..తనకు అదృష్టం కలిసి రావడం లేదు అన్నట్లుగా ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది.