వారెవ్వ: 24 ఏళ్ల రజనీకాంత్ రికార్డ్ ను చిత్తు చేసిన చరణ్-తారక్..ఏం క్రేజ్ రా బాబు..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా గా పేరు సంపాదించుకున్న ఆర్ఆర్ఆర్ మూవీ గురించి ఎంత చెప్పిన తక్కువే. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ ని సంపాదించుకున్నింది. అంతేకాదు ఇద్దరూ స్టార్ హీరోలను పెట్టి మల్టీస్టారర్ మూవీగా తరకెక్కించడం చాలా ట్రోలింగ్ తో కూడుకున్న సమస్య . అలాంటి ట్రోలింగ్స్ ని అధిగమించి మరీ రాజమౌళి ..అభిమానులను సాటిస్ఫై చేయడం నిజంగా గర్వించదగ్గ విషయం అంటూ సినీ స్టార్స్ అందరూ సక్సెస్ మీట్లో చెప్పుకొచ్చారు .

కాగా గ్లోబల్ బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు సినిమా పేరును ఆర్ఆరార్ తో మరోసారి నిరూపించాడు జక్కన్న అంటూ ఆయన పేరు ఓ రేంజ్ లో ట్రెండ్ చేశారు ఫ్యాన్స్. దీనికి సంబంధించిన వీడియోస్ పిక్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఆరారార్ పేరు మారు మ్రోగిపోయింది అంటే ఆయన ఏ రేంజ్ లో ఈ సినిమాని తెరకెక్కించారో మనం ఊహించుకోవచ్చు. కాగా ఇప్పటికే బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసిన ఆర్ఆర్ఆర్ ఎన్నో రికార్డులను కొల్లగొట్టింది .

ఎన్నో రికార్డులను తిరగరాసింది. ఈ క్రమంలోనే అత్యంత అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఆర్ ఆర్ ఆర్ సినిమా అక్టోబర్ 21న జపాన్ లో గ్రాండ్గా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అక్కడ 24 ఏళ్ల కిందట రిలీజ్ అయిన రజినీకాంత్ ముత్తు సినిమా రికార్డులను అవలీలగా దాటేసింది. జపాన్ లో రీసెంట్గా రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ సినిమా 24 ఏళ్ల ముందు రిలీజ్ అయిన రజినీకాంత్ ముత్తు సినిమా రికార్డును బద్దలు కొట్టింది . జపాన్లో అత్యధిక గ్రాస్ సాధించిన ఇండియన్ మూవీ గా ముత్తు సినిమాపై ఉన్న రికార్డును ఆర్ఆర్ఆర్ సినిమా ఇన్ని ఏళ్లకు బ్రేక్ చేసింది .

తాజా అప్డేట్ ప్రకారం జపనీస్ బాక్స్ ఆఫీస్ వద్ద ఆర్ఆర్ఆర్ 400 మిలియన్లను దక్కించుకుంది . మన తెలుగు లెక్కల ప్రకారం 24 కోట్ల 13 లక్షలకు పైగానే వసూలు చేసింది . దీనితో ముత్తు పేరుపై ఉన్న 24 వేల రికార్డులను సింపుల్గా చరణ్-తారక్ బ్రేక్ చేశారు అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఏది ఏమైనా సరే రిలీజ్ అయి దాదాపు సంవత్సరం కావస్తున్న ఆర్ఆర్ఆర్ రికార్డులు మోత ఇంకా మారు మ్రోగిపోతూనే ఉంది అంటే రాజమౌళి సత్త ఏంటో మనం అర్ధం చేసుకోవచ్చు.