కోట్లాదిమంది పవర్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఈగర్ గా వెయిట్ చేసిన అప్డేట్ ఇవాళ వచ్చేసింది . బ్లాస్టింగ్ కాంబో గా పేరు సంపాదించుకున్న హరీశంకర్ పవన్ కాంబినేషన్లో రాబోతున్న కొత్త చిత్రం నేడు లాంఛనంగా ప్రారంభమైంది . ఇదివరకే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా హరిశంకర్ తో సినిమాను ఫిక్స్ అయ్యాడు పవన్ కళ్యాణ్. దానికి పేరును కూడా భవధీయుడు భగత్ సింగ్ అంటూ అనౌన్స్ చేశాడు .
కానీ కొన్ని అనివార్య కారణాల కారణంగా ఆ పేరుని మారుస్తూ ఉస్తాద్ భగత్ సింగ్ అంటూ మార్చుకొని నేడు పూజా కార్యక్రమాలు నిర్వహించారు మైత్రి మూవీ మేకర్స్. ఈ సినిమా పూజా కార్యక్రమాలు నేడు మైత్రి మూవీ సంస్థ ఆఫీసులో గ్రాండ్ గా జరిగాయి . అయితే ఈ చిత్ర లాంచింగ్ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని, బుచ్చిబాబు ,వివి వినాయక్ లాంటి డైరెక్టర్స్ కూడా హాజరయ్యారు . అంతా బాగున్నప్పటికీ ఈ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ జాన్ జిగిడి దోస్త్ మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు మిస్ అయ్యాడు.
ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా త్రివిక్రమ్ -పవన్ కళ్యాణ్ కి మధ్య ఉన్న విభేదాలు కారణంగా వాళ్ళు విడిపోయారు అంటూ వస్తున్న వార్తలను నిజం అంటూ నమ్ముతున్నారు పవన్ ఫ్యాన్స్ . పవన్ కళ్యాణ్ ఏ ఫంక్షన్ అయినా ..ఏ మీటింగ్ అయినా త్రివిక్రమ్ మిస్ చేయడు . ఏదో ఇంపార్టెంట్ రీజన్ ఉంటే తప్పిస్తే ఆయన అటెండ్ కాకుండా ఉండరు. అయితే ఆయన హైదరాబాద్లో లేడా అంటే హైదరాబాద్లో కూడా ఉన్నాడని సమాచారం అందుతుంది .
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ కి మధ్య మ్యాటర్ చెడింది అని ఆయనతో కటీఫ్ చేసుకున్నాడని ఇక మాటల్లేవ్ మాట్లాడుకోవడాలు లేవంటూ బన్నీ డైలాగ్ ను సెట్ చేసి మీమ్స్ క్రియేట్ చేసి ట్రోల్ చేస్తున్నారు జనాభ. ఓ పక్క ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న అప్డేట్ వచ్చింది అని సంతోషపడే లోపే ..మరో పక్కన పవర్ స్టార్ – త్రివిక్రమ్ విడిపోయారు అన్న వార్తలు వినిపిస్తుండటంతో పవన్ ఫ్యాన్స్ చాలా హర్ట్ అవుతున్నారు.