బాలయ్య ఎనర్జీని ప్రభాస్ తట్టుకుంటాడా..?

టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈ షోకి తాజాగా ప్రభాస్ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. అతనితో పాటు మరొక హీరో గోపీచంద్ కూడా అతిథిగా స్పెషల్ అట్రాక్షన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటి నుంచి గోపీచంద్ ప్రభాస్ మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. ఈ ఆదివారం రోజు ఎపిసోడ్ కు సంబంధించి షూటింగ్ పనులు అయితే ముగించినట్లుగా సమాచారం.

Prabhas with Balayya; Massiest episode coming soon - TeluguBulletin.comఅయితే ఈ ఎపిసోడ్లో బాలయ్య ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అనే విషయం పై అందరికీ అనుమానాలు నెలకొన్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ ను ఇబ్బంది పెట్టే విషయాలపై బాలయ్య సరదాగా అడగబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పెళ్లి విషయం హైలైట్ గా నిలవబోతున్నట్లు సమాచారం ఇప్పటివరకు ఎన్నోసార్లు ప్రభాస్ పెళ్లిపై పలు వార్తలు వినిపించాయి.. కానీ ఆ విషయంలో ప్రభాస్ ఎలా స్పందిస్తారనే విషయంపై చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. అలాగే అనుష్కతో డేటింగ్ కృతి సనన్ తో డేటింగ్ అనే వార్తలు కూడా బాగా పుట్టుకొచ్చాయి.

Stunning looks of Prabhas from Unstoppable 2 go viral | 123telugu.com
ఇక గోపీచంద్ గతంలో అనుష్క మధ్య కూడా పలు రూమర్సు వినిపించాయి ఆ విషయంలో కూడా గోపీచంద్ ను బాలయ్య ప్రశ్నించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఇక ప్రశ్నలతో పాటు ప్రతి ఇంటర్వ్యూలో కూడా బాలయ్య స్టార్స్ కు సంబంధించి ఎమోషనల్ అంశాలను కూడా ప్రస్తావిస్తూ ఉంటారు. ఇటీవలే ప్రభాస్ పెదనాన్న కూడా మరణించారు అలాగే ప్రభాస్ తండ్రి కూడా మరణించారు దీంతో ప్రభాస్ మీడియా ముందు రియాక్ట్ కాలేదు. ఈ విషయంలో ప్రభాస్ ని బాలయ్య కొన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి మరి.