ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది . బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ మరోసారి తల్లి కాబోతుందా అంటే అవునని అంటున్నారు బాలీవుడ్ మీడియా వర్గాలు . మనకు తెలిసిందే టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీని ప్రేమించి పెళ్లి చేసుకున్న అనుష్క శర్మ.. గత ఏడాది జనవరి 11న పండంటి ఆడపిల్లకు జన్మించింది. ఈ క్రమంలోనే కోహ్లీ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ కంగ్రాట్యులేషన్స్ చెప్పుకొచ్చారు.
అయితే రీసెంట్ గా బాలీవుడ్ మీడియాలో అమ్మడు మరోసారి తల్లి కాబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఇది తెలుసుకున్న అభిమానులు కొందరు సంతోషిస్తున్నా.. మరికొందరు ఇంత త్వరగా రెండో బేబీ నా అంటూ షాక్ పోతున్నారు . కాగా అనుష్క శర్మ విరాట్ కోహ్లీ ఓ యాడ్లో నటించేటప్పుడే ప్రేమలో పడ్డారు . అయితే ఈ విషయాన్ని వాళ్ళు గ్రహించినా.. అభిమానులకు లేటుగా చెప్పారు . అయితే వీళ్ళ మధ్య ఏదో జరుగుతుందని ఫాన్స్ ఎప్పుడో కనిపెట్టారు . అందుకే అనుష్క శర్మ – కోహ్లీ లవ్ లో ఉన్నారు అంటూ రకరకాలుగా పోస్ట్ లు పెట్టారు.
ఆయన ఏం మాత్రం స్పందించని జంట ..వన్ ఫైన్ డే మేం పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు . 11 డిసెంబర్ 2017 వీళ్ళ పెళ్లి గ్రాండ్ గా జరిగింది. కాగా సరిగ్గా ఇదే రోజు వీళ్లు మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు రావడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రెగ్నెన్సీ విషయం కావాలనే అనుష్కా దాచుతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా సరే టీమిండియాలోకి మరో బుల్లి కోహ్లీ రాబోతున్నాడు అంటూ ఫ్యాన్స్ సంబరపడుతున్నా.. దీనిపై ఇప్పటివరకు అఫీషియల్ ప్రకటన అయితే లేదు . చూడాలి విరాట్ కోహ్లీ – అనుష్క శర్మ ప్రెగ్నెన్సి పై ఎలాంటి అప్డేట్ ఇస్తారో..?