“అ ఆ” సినిమా ను వదులుకున్న దురదుష్టవంతురాలు ఎవరో తెలిస్తే..ఖచ్చితంగా షాక్ అయిపోతారు..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు ఒకరి కోసం రాసుకున్న కథను మరొక హీరోతో హీరోయిన్ తో చేయడం సర్వసాధారణం. ఇప్పటివరకు అలాంటి విషయాలను మన విన్నం . కాగా రీసెంట్గా ఇండస్ట్రీలో మంచి నటి అంటూ పేరు సంపాదించుకున్న కల్పిక గణేష్ కూడా అలా ఎన్నో సినిమాలను మిస్ అయ్యానని చెప్పుకొచ్చింది. మనకు తెలిసిందే యశోద సినిమాలో సరో గెట్ మదర్ గా నటించిన కల్పిక గణేష్ అంతకుముందు చాలా తెలుగు సినిమాల్లో మంచి రోల్స్ చేసి మంచి నటిగా మెప్పించింది.

మరి ముఖ్యంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి . ఈ సినిమాలోని సమంతతో స్క్రీన్ షేర్ చేసుకుంది కల్పిక.. రీసెంట్ గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన యశోద సినిమాలోను సమంత తో స్క్రీన్ షేర్ చేసుకుంది కల్పిక.. అంతకుముందే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్ట్ చేసిన అ ఆ సినిమాలో కూడా సమంతతో స్క్రీన్ షేర్ చేసుకొని ఉండాల్సింది కల్పిక.. కానీ అప్పటికే కొన్ని సినిమాలకు కమిట్ అవ్వడం ద్వారా మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది .

నిజానికి అ ఆ సినిమాలో నితిన్ చెల్లెలుగా కల్పిక గణేష్ ని అప్రోచ్ అయ్యారట త్రివిక్రమ్. అప్పటికే ఆమె పలు ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో త్రివిక్రమ్ సార్ కి నో చెప్పిందట. ఇదే విషయాన్ని రీసెంట్ ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చింది. అంతేకాదు అ ఆ సినిమాను వదులుకొని చేసిన మిగతా సినిమాలు కూడా డిజాస్టర్ గా మారాయి. ఈ క్రమంలోనే ఆమె అ ఆ సినిమా చేసుంటే బాగుండేది కెరియర్ మరింత ముందుకు వెళ్ళుండేది అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు. ప్రజెంట్ ఆమె అరుదైన వ్యాధితో బాధపడుతూ..ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు.

Share post:

Latest