వచ్చేయేడాది సంక్రాంతికి బిగ్ వార్ జరగబోతోంది. ఇద్దరు అగ్ర హీరోల కారణంగా ఈ సంక్రాంతి చాలా రసవత్తంగా మారబోతోంది. టాలీవుడ్ అగ్ర హీరోలలో చిరంజీవి,బాలకృష్ణ పోటీపడుతూ వారి సినిమాలను విడుదల చేస్తున్నారు. అయితే ఇ హవా ఇప్పుడు మొదలైంది కాదు 1987 నుంచే మొదలైందట. మొదటిసారి దొంగ మొగుడుతో 1887లో చిరంజీవి బరిలో దిగితే బాలయ్య భార్గవ రాముడు అనే సినిమాతో పోటీపడ్డారట. అప్పుడు దొంగ మొగుడు సినిమా బ్లాక్ బస్టర్ విజయం బాలకృష్ణ యావరేజ్ గా నిలిచారు.
ఇక అప్పటినుంచి సంక్రాంతి పోరు కొనసాగుతూనే ఉందట. ఒకసారి చిరంజీవి పై చేయి సాధిస్తే మరొకసారి బాలయ్య పై చెయ్యి సాధిస్తూ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలా 1988 లో మంచి దొంగ సినిమాతో సంక్రాంతి బరిలో చిరంజీవి దిగాక బాలయ్య ఇన్స్పెక్టర్ ప్రతాప్ సినిమాతో ప్లాప్ ను చూశారు. మళ్లీ సంవత్సరం అత్తకు యముడు అమ్మాయికి మొగుడు అనే చిత్రంతో చిరంజీవి సంక్రాంతి బర్రులను ఆ ఏడాది బాలకృష్ణ నిలబడలేదు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి మళ్లీ 1997లో చిరంజీవి హిట్లర్ బాలయ్య పెద్దన్నయ్య సినిమాతో వచ్చారు.
ఆ తర్వాత 1999లో బాలకృష్ణ సమారసింహారెడ్డి సినిమాతో చిరంజీవి స్నేహం కోసం సినిమాతో పోటీ పడక బాలకృష్ణ సమరసింహారెడ్డి ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. 2000 సంవత్సరంలో చిరంజీవి అన్నయ్య తో రాగ బాలకృష్ణ వంశోద్ధారకుడు సినిమాతో వచ్చారు. ఆ తర్వాత 2001లో చిరంజీవి మృగరాజు తో బాలకృష్ణ నరసింహనాయుడు సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. 2004లో అంజి సినిమాతో చిరంజీవి వస్తే బాలయ్య లక్ష్మీనరసింహ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. 2017లో ఖైదీ నెంబర్ 150 చిత్రంతో చిరంజీవి రీయంట్రీ ఇవ్వగా బాలయ్య అదే ఏడాది గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో పోటీపడ్డారు రెండు చిత్రాలు మంచి విషయాన్ని అందుకున్నాయి.
ఇప్పుడు మళ్లీ 2023లో సంక్రాంతి బరీలో చిరంజీవి, బాలయ్య ఇద్దరు కూడా పోటీ పడనున్నారు. దాదాపుగా ఆరేళ్ల తర్వాత ఇద్దరు అగ్ర హీరోలు పోటీ పడడంతో ఎవరిది పై చేయి ఉంటుందని అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.