మొదట షార్ట్ ఫిలిమ్స్ చేస్తే ప్రేక్షకులను అలరించిన తెలుగు అమ్మాయి చాందిని చౌదరి ఎన్నో వెబ్ సిరీస్లలో నటించింది. అయితే ఈమెకు మాత్రం కలర్ ఫోటో సినిమాతో మంచి క్రేజ్ రావడంతో పాటు నేషనల్ అవార్డు కూడా అందుకుంది. ఈ మధ్యకాలంలో తెలుగు అమ్మాయిల హవా అసలు కనిపించడం లేదు. దీంతో వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ పరవాలేదు అనిపించుకుంటోంది చాందిని చౌదరి. ఇక సోషల్ మీడియాలో కూడా ఈమెకు హరాస్మెంట్ పెద్ద తలనొప్పిగా మారిందని తెలియజేస్తోంది. తన పేరు మీద ఒక పెద్ద స్కాం చేస్తున్నట్లుగా తెలియజేయడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం.
చాందిని చౌదరి తెలియజేస్తూ.. కొన్ని నెలలుగా తన పేరు మీద తన ఫ్రెండ్ పేరు మీద కొన్ని ఇంటర్నేషనల్ నెంబర్స్ నుంచి కాంట్రాక్ట్ అన్నిటితో కాంట్రాక్ట్ డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్ తీసుకుంటున్నారని తన ఫోటోని డిపి గా పెట్టుకొని తన ఫ్రెండ్స్ పర్సనల్ డీటెయిల్స్ ని కూడా తీసుకుంటున్నారని ఇమే ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేయడం జరిగింది. దీంతో ఫ్రూప్ లతో సహా చాందిని చౌదరి తన పేరు మీద జరుగుతున్న మోసాన్ని బయట పెట్టడం జరిగింది.
తన పేరు మీద ఇంటర్నేషనల్ నెంబర్ నుంచి ఎవరో ఇలా కావాలని చేస్తున్నారని వారికి తగ్గట్టుగా యాక్షన్ కి రెడీ అంటోంది చాందిని చౌదరి. అయితే ఇలా ఎవరైనా సరే తన పేరుతో ఎవరినైనా కాంటాక్ట్ అయినట్లు అయితే తనకు తెలియజేయండి అంటు తెలియజేస్తోంది చాందిని. అయితే తన పైన జరుగుతున్న ఇలాంటి హరాస్మెంట్ వల్ల మరింత స్ట్రాంగ్ గా పోరాడేందుకు సిద్ధమయ్యింది చాందిని చౌదరి. మరి ఈ విషయం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి మరి.