తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ అవాయిడ్ చిత్రంగా పేరు పొందింది పుష్ప-2. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ అభిమానులు ఎంత ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా ఈ చిత్రానికి సంబంధించి అప్డేట్ ప్రకటించాలని అభిమానులు పలు రకాల ధర్నాలు కూడా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత ఏడాది డిసెంబర్ 17న ఈ సినిమా భారీ స్థాయిలో విడుదలై పాన్ ఇండియా వైడ్ గా మంచి సక్సెస్ అయ్యింది. ఈ చిత్రం ఉత్తరాదిలో ఏకంగా రూ. 100 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఏడాది తర్వాత పుష్ప-2 సినిమా సెట్ లో అడుగు పెట్టబోతున్నాడు.
గత కొన్ని నెలలుగా ఈ చిత్రం కథలో పలు మెరుగులు దిద్దుతున్నట్లుగా సుకుమార్ తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరిని అలరించే సినిమాగా ఈ చిత్రం ఉండబోతుందని గతంలో చిత్ర బృందం తెలియజేశారు. ఎట్టకేలకు పుష్ప సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈనెల 12 వ తేదీ నుంచి సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. దీంతో ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశం ఎక్కువగా లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పుష్ప సినిమా ను మించి పుష్ప -2 సినిమా ఉండబోతోంది కనుక దాదాపుగా మరింత సమయం పడుతుందని సమాచారం.
ఈ చిత్రం 2024 సమ్మర్లో విడుదల అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ వారు సుకుమార్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రణాళికంగా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకేసారి ఈ సినిమాని రష్యన్ వర్షన్ లో కూడా విడుదల చేయబోతున్నట్లు సమాచారం. మరి ఈ సినిమాపై ఎలాంటి అప్డేట్ ప్రకటిస్తుందో చిత్ర బృందం చూడాలి.