బుల్లితెర యాంకర్ రష్మీ జబర్దస్త్ ద్వారా ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకుని పలు సినిమాలలో కూడా నటించి. తన హాట్ షో తో ప్రేక్షకులను అలరించింది. ఇక ఈ షో తర్వాత ఈటీవీలో వస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీకి యాంకర్ గా రష్మీ తనదైన స్టైల్ లో ఈ షోనీ నడిపిస్తూంది. తాజాగా రష్మీ శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో మాట్లాడుతూ ఎవరు ఊహించని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
రష్మీ మాట్లాడుతూ.. ‘నేను నా జీవితంలో ఒక మనిషికి క్షమాపణ చెప్పాలని ఆమె అంది. ఆ వ్యక్తి ఎవరో ఇక్కడున్న వారందరికీ తెలుసు అని రష్మీ చెప్పుకొచ్చింది. ఆ వ్యక్తి తన ప్రతిభను ఈ వేదిక మీద చూపించాడని’. ‘అయితే ఆ సమయంలో ఆ వ్యక్తికి నేను ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయానని చెప్పుకొచ్చింది. అయితే నా ఈ ప్రయాణంలో ఆ వ్యక్తి నాకు ఎన్నో విషయాలు చెప్పాడని రష్మి చెప్పుకొచ్చింది’.
‘మొదట ఆ వ్యక్తిని పట్టించుకోకపోయినా తన స్కిట్లతో నాకు చాలా దగ్గరయ్యాడని’.. ‘ఆ కారణం వల్ల నేను మనస్ఫూర్తిగా ఆ వ్యక్తికి క్షమాపలు చెప్పాలని అనుకుంటున్నానని రష్మీ పేర్కొంది’. ‘ఆరోజు ఆ వ్యక్తి చెప్పిన మాటలు నేను పట్టించుకుని ఉంటే నా కెరియర్ మరో లెవల్ లో ఉండేదని రష్మీ కామెంట్లు చేసింది’. ‘ఆ వ్యక్తి మరెవరో కాదు ఆర్టిస్ట్ బాబు అని ఫైనల్ గా రష్మీ అతని పేరును బయట పెట్టింది’. ఆ టైంలో ఆయన చేసిన కొన్ని పనుల వల్ల రైటర్ బాబు కాస్త యాక్టర్ బాబు అయ్యాడని రష్మీ తెలిపింది. అతని మేము సీరియస్ గా తీసుకున్నాం కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ స్థాయిలో ఉన్నాడని రష్మీ చెప్పుకొచ్చింది.
అతను నాకు అవకాశాలు ఇవ్వకపోతే చెయ్యి కోసుకుంటానని బెదిరించాడని ఆ కారణం వల్లే రైటర్ బాబుని ఆర్టిస్ట్ బాబుగా మార్చామని రష్మీ కామెంట్లు చేశారు. అందుకు ఆడియన్స్ కు కూడా సారీ చెప్పాలని ఆమె అన్నారు. రష్మీ చేసిన ఈ కామెంట్లు తో ప్రస్తుతం అందరు షాక్ అయ్యారు. ఇక ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .