తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు బాలయ్య నటనపరంగా ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నందమూరి కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతున్న ఇప్పటికి తన హవా కొనసాగిస్తూనే ఉన్నారు. యువ హీరోలకు దీటుగా తన సినిమాలను విడుదల చేసి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకోవడమే కాకుండా కలెక్షన్ల పరంగా సునామి సృష్టిస్తున్నారు. డైరెక్టర్ బోయపాటి శ్రీను గత సంవత్సరం తెరకెక్కించిన అఖండ సినిమాతో మరింత క్రేజ్ ను అందుకోవడంతో తన తదుపరి చిత్రాల పైన కూడా అంతే క్రేజ్ నెలగొంది.
ప్రస్తుతం డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహారెడ్డి సినిమాలో నటిస్తున్నారు. బాలకృష్ణ ఇందులో హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తూ ఉన్నది అలాగే కన్నడ నటుడు దునియా విజయ్ కూడా విలన్ గా నటిస్తూ ఉన్నారు.వరలక్ష్మి శరత్ కుమార్ బాలకృష్ణ చెల్లెలి పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి నెలలో సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశలో ఉన్నది.ఈ నేపథ్యంలో మెల్ల మెల్లగా సినిమా ప్రమోషన్స్ ని మొదలుపెట్టారు చిత్ర బృందం.
ఇప్పటివరకు విడుదలైన టైటిల్, టీజర్, ట్రైలర్ వంటివి ఈ సినిమాకు మంచి హైప్ ను తీసుకోవచ్చాయి. ఇప్పుడు తాజాగా బాలకృష్ణ ఈ సినిమా కోసం అందుకుంటున్న రెమ్యూనరేషన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. బాలకృష్ణ గతంలో ఒక్కో సినిమాకి రూ.10 కోట్ల రూపాయలు అందుకొంటూ ఉండేవారు.ఇప్పుడు తాజాగా ఈ సినిమాకి రూ.16 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వీర సింహారెడ్డి సినిమా అయిపోయిన వెంటనే.. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్నారు