RRR సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ దిగంతాలకు చేరిందంటే ఆశ్చర్యం పడాల్సిన అవసరం లేదు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ సినిమాతోనే చరణ్ తెలుగునాట మంచి నటుడిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలో దేశంలోనే అత్యుత్తమ నటులలో ఒకరిగా చేరిపోయారు. మరీ ముఖ్యంగా RRRలో చరణ్ పెర్ఫామెన్స్ తో వరల్డ్ వైడ్ గా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సోషల్ మీడియాలో చెర్రీ ఫ్యాన్ ఫాలోయింగ్ జెట్ స్పీడ్ తో దూసుకుపోయింది.
అవును, తాజాగా చరణ్ ఇన్ స్టా అకౌంట్లో 10 మిలియన్ ఫాలోవర్స్ చేరిపోయారు. ఇంత త్వరగా అంతమందిని సంపాదించుకున్న హీరోగా చరణ్ రికార్డులు బద్దలు కొట్టాడు. కేవలం RRR సినిమా తర్వాత దాదాపు 20 లక్షల ఫాలోవర్స్ ను చెర్రీ సొంతం చేసుకున్నట్టు సర్వే. టాలీవుడ్ నుంచి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముందుగా పాన్ ఇండియా స్టార్ అయిన సంగతి తెలిసినదే. అయినా 9 మిలియన్ల ఫాలోవర్స్ వద్దే ఆగిపోయారు ప్రభాస్. ఇక మహేశ్ పాన్ ఇండియాలో అడుగుపెట్టకపోయినా 9.2 మిలియన్ల ఫాలోవర్స్ ను ఇప్పటికే కలిగి ఉన్నారు.
అయితే వీరి క్రేజ్ ను దాటి మరీ చెర్రీ సోషల్ మీడియాలో హవా కొనసాగించడం విశేషం. దీంతో మ్యాన్ ఆఫ్ మాసెస్ అనే టైటిట్ లో చెర్రీని మెగా ఫాన్స్ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అయితే టాలీవుడ్లో అత్యధిక సోషల్ మీడియా ఫాలోవర్స్ ను కలిగిన హీరో మాత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నారు. దాదాపు 20 మిలియన్ల ఫాలోవర్స్ బన్నీ సొంతం. ఆ తర్వాత స్థానంలో విజయ్ దేవరకొండ 17 మిలియన్స్ కలిగి వున్నారు. ప్రస్తుతం ‘ఆర్సీ15’లో శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.