అన్ స్టాపబుల్ హిస్ట‌రీలో ఫ‌స్ట్ టైం… ఆ రికార్డ్ బాలయ్య సొంతం..!

నందమూరి బాలకృష్ణలో ఎవరు ఊహించిన విధంగా తనలోని కొత్త యాంగిల్ ని అభిమానులకు పరిచయం చేసిన షో అన్‌స్టాప‌బుల్‌. బాల‌య్య తొలిసారి వ్యాఖ్యాత‌గా మారి చేసిన అన్ స్టాపబుల్ టాక్ షో ఎంత పెద్ద సంచలమైందో తెలిసిందే. ఈ షోతో బాలకృష్ణ యువతకు బాగా దగ్గరయ్యాడు. బాలయ్యలో కొత్త యాంగిల్ చూసిన ప్రతి ఒక్కరు షాక్ అయి బాలయ్యకు అభిమానులుగా మారిపోయారు. ఇక రీసెంట్ గా ఆన్ స్టాపబుల్ సీజన్ 2 కూడా మొదలై ఎవరూ ఊహించిన రీతిలో భారీ వ్యూస్ దక్కించుకుంటోంది.

ఈ సీజన్‌లో ఇప్పటికే నాలుగు ఎపిసోడ్‌లు పూర్తి అవ్వక త్వరలోనే ఐదో ఎపిసోడ్ కూడా ప్రసారం కానుంది. నాలుగో ఎపిసోడ్‌కి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మరియు మాజీ స్పీకర్, ప్రస్తుత తెలంగాణ ఎంపీ సురేష్ రెడ్డి వీరితోపాటు సీనియర్ హీరోయిన్ రాధికా శరత్ కుమార్ కూడా ముఖ్య అతిథులుగా వచ్చారు. ఈ ఎపిసోడ్ కూడా బాలయ్య తన పంచులతో షోనీ హీట్ ఎక్కించాడు.

Unstoppable With NBK Season 2 Ep 4 Guests, OTT Release Date, Promo & More - JanBharat Times

చాలా రోజుల తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఈ షోలో కనిపించడంతో ఈ ఎపిసోడ్ కి ఎవరు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు రాబోయే ఐదో ఎపిసోడ్ కు టాలీవుడ్ లో ఉన్న నలుగురు లెజెండ్రీ పర్సన్స్ రాబోతున్నారని తెలుస్తుంది. వారిలో ఇద్దరు తెలుగు చలనచిత్ర పరిశ్రమంలోనే అగ్ర నిర్మాతలుగా కొనసాగుతున్న సురేష్ బాబు, అల్లు అరవింద్.

మరో ఇద్దరూ తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని అగ్ర దర్శకులుగా తమ సినిమాలతో తెలుగు సినిమాని మరో లెవల్ కు తీసుకువెళ్లిన లెజెండ్రీ దర్శకులైన కె విశ్వనాథ్, కే రాఘవేంద్రరావు. ఈ నలుగురు బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షో కి ముఖ్య అతిథులుగా రాబోతున్నారు అని తెలుస్తుంది. ఈ ఎపిసోడ్ తో బాలకృష్ణ ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేయబోతున్నాడు చూడాలి.