నాదెండ్లతోనే ట్విస్ట్..పవన్ రూట్ మార్చేలా?

వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీని గెలవనివ్వను అని పవన్ కల్యాణ్ సవాళ్ళు చేస్తున్న విషయం తెలిసిందే. ఎట్టి పరిస్తితుల్లోనూ వైసీపీని ఓడించే తీరుతామని పవన్ చెబుతున్నారు. మరి పవన్‌కు సింగిల్ గా వైసీపీకి చెక్ పెట్టే సత్తా ఉందా? అంటే రాజకీయం తెలిసినవారు లేదనే అంటారు. ఎందుకంటే పవన్ బలం ఎంత అనేది అందరికీ క్లారిటీ ఉంది. జనసేన పార్టీకి మహా అయితే 10 శాతం ఓటు బ్యాంక్ కనిపిస్తోంది. ఈ ఓటు బ్యాంక్‌తో జగన్‌ని ఓడించడం సాధ్యమయ్యే పని కాదు. పోనీ ఒకశాతం ఓటు బ్యాంక్ కూడా లేని బీజేపీతో కూడా సాధ్యం కాదు.

అయితే 10 శాతంతో గెలవలేరు గాని గెలుపోటములని మాత్రం తారుమారు చేయగలరు. గత ఎన్నికల్లో అదే చేశారు. ఓట్లు చీల్చి టీడీపీని ఓడించగా, వైసీపీని గెలిపించారు. కానీ ఇప్పుడు వైసీపీని ఓడించాలనే పట్టుదలతో పవన్ ఉన్నారు. అలా జరగాలంటే ఖచ్చితంగా టీడీపీతో కలిసే పవన్ ముందుకెళ్లాలి..లేదంటే వైసీపీని ఓడించడం సాధ్యమయ్యే పని కాదు. ఈ విషయం పవన్‌కు కూడా తెలుసని చెప్పొచ్చు.

pawan

కాకపోతే ప్రధాని మోదీతో భేటీ తర్వాత పవన్ వర్షన్ మారిందని, టీడీపీతో కలవరని ప్రచారం జరిగింది. కానీ అది కేవలం ప్రచారమే అని అర్ధమవుతుంది. తాజాగా మంగళగిరిలో పవన్‌లో వైసీపీ టార్గెట్ గా చేసిన విమర్శలని బట్టి చూస్తే..ఖచ్చితంగా పవన్, చంద్రబాబుతో కలిసే ముందుకెళ్తారని తెలుస్తోంది. అయితే టీడీపీతో కలిసి వెళ్ళేలా జనసేనలో నెంబర్ 2గా  ఉన్న నాదెండ్ల మనోహర్ ప్లాన్ చేశారని సమాచారం.

ఎందుకంటే జనసేన బలం ఎంత ఉందో..గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనేది పవన్ కంటే..నాదెండ్లకే ఎక్కువ తెలుసని చెప్పవచ్చు. ఆయనే క్షేత్ర స్థాయిలో తిరుగుతున్నారు కాబట్టి..పైగా జనసేనలో మెజారిటీ నాయకులు వచ్చే ఎన్నికల్లో అధికారం కోరుకుంటున్నారు. ఇక అధికారంలోకి రావాలంటే టీడీపీతో పొత్తు తప్పనిసరి..అలా కాకుండా బీజేపీతో కలిసి వెళితే ఫలితం శూన్యం..అందుకే టీడీపీతోనే పొత్తు సెట్ అయ్యేలా నాదెండ్ల సెట్ చేస్తున్నారని తెలిసింది.