టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కమెడియన్ ఆలీ మధ్య స్నేహబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే.అప్పట్లో ఎక్కువగా పవన్ కళ్యాణ్ సినిమాలలో కనిపించి బాగా కామెడీ చేసి మంచి పాపులారిటీ సంపాదించారు ఆలీ. ఆలీ చైల్డ్ యాక్టర్ గా నుంచి ఎన్నో సినిమాలలో నటించి హీరోగా,కమెడియన్గా మంచి పేరు సంపాదించారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక పార్టీ అధినేతగా ఉండడంతో ఆలీ పవన్ కళ్యాణ్ కు సపోర్టు ఇవ్వకుండా వైసిపి పార్టీకి సపోర్టు ఇచ్చారు.
దీంతో కమెడియన్ ఆలీ పార్టీ మేరకు పవన్ కళ్యాణ్ పైన పలు విమర్శలు కూడా చేశారు. ఆ సమయంలో ఆలీ చేసిన కామెంట్లు పవన్ కళ్యాణ్ అభిమానులను చాలా బాధపెట్టాయని సమాచారం. అందుచేతనే ఆలీ కూతురు పెళ్లికి పవన్ కళ్యాణ్ హాజరు కాలేదని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఆలీ,పవన్ ను కలిసి పెళ్లికి కచ్చితంగా రావాలని కోరారుట.అయితే పొలిటికల్ గా వైసీపీతో విభేదాలు ఉన్నందువల్ల కమెడియన్ ఆలీ పెళ్లికి హాజరు కావడం వల్ల విమర్శలు వచ్చే అవకాశం ఉంటుందని పవన్ భావించి పెళ్లికి హాజరు కాలేక పోయినట్లు సమాచారం.
అయితే రాబోయే రోజుల్లో పవన్ కొత్తజంట ఆశీర్వదించే అవకాశాలు అయితే ఉన్నాయని మీడియాలో వార్తలు బాగా వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తో గ్యాప్ లేదని ఆలీ చెబుతూ ఉండగా పవన్ ఆలీ కలిసి ఒకే సినిమాలో కనిపిస్తే బాగుంటుందని ఇద్దరి అభిమానులు అనుకుంటున్నారు. పవన్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా షూటింగ్లో పాల్గొంటూ ఉండడమే కాకుండా..ప్రస్తుతం పవన్ వరుసగా నాలుగైదు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మరి రాబోయే సినిమాలలో కమెడియన్ ఆలీ ఏదో ఒక చిత్రంలో నటిస్తారేమో చూడాలి.