టాలీవుడ్ యువ హీరోలలో స్టార్ హీరోగా దూసుకుపోతున్న నితిన్ ప్రస్తుతం వరుస అపజయాలతో సతమతమవుతున్నాడు. భీష్మతో సూపర్ హిట్ అందుకున్న నితిన్ తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకుని నటించిన మాచర్ల నియోజకవర్గం నితిన్ కు తన కెరియర్ లోనే అత్యంత డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయింది. ఆ సినిమాతో తన అభిమానులను చాలా డిజప్పాయింట్ చేసిన ఈ యువ హీరో కాస్త గ్యాప్ తీసుకుని మరో కొత్త సినిమా మొదలుపెట్టాడు.
ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు రైటర్ గా కథ అందించి అల్లు అర్జున్ హీరోగా వచ్చిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో డైరెక్టర్‌గా మారాడు వక్కంతం వంశీ. మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలన ఈ దర్శకుడు. తర్వాత ఆ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటివరకు తన రెండో సినిమాని మొదలు పెట్టలేదు. తరవాత నితిన్ కు ఓ కథ చెప్పగా ఆ స్టోరీ నచ్చడంతో సినిమాకు ఓకే చేశాడు నితిన్.
ఈ సినిమాకు సంబంధించిన తొలి షెడ్యూల్ షూటింగ్ ఎట్టకేలకు ప్రారంభించినట్టు తెలుస్తుంది. ఈ సినిమా మొదటి షెడ్యూల్ రంపచోడవరం, మారేడుమిల్లి అడవి ప్రాంతాలలో చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాను దర్శకుడు పక్క మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాను ఆదిత్య మూవీస్ మరియు శ్రేష్ట ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఈ సినిమాలో నితిన్ కు జంటగా పెళ్లి సందడి ఫ్రేమ్ శ్రీ లీలా నటిస్తుంది. హరీష్ జైరాజ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. స్పైడర్ తర్వాత హరీష్ జైరాజ్ అందిస్తున్న తెలుగు సినిమా ఇదే. వరుస ఫ్లాఫ్స్ లో ఉన్న నితిన్ కు తొలి సినిమాతోనే ప్లాప్ అందుకుని హిట్ కోసం ఎదురు చూస్తున్న వక్కంతం వంశీ సక్సెస్ ఇస్తాడో లేదో చూడాలి.