ఈ స్టార్స్ బుల్లితెర ఎలాంటి ప్రోగ్రామ్స్ చేశారో తెలుసా.. వెరీ ఫన్నీ..!

సక్సెస్ ఇస్ నాట్ ఏ డెస్టినేషన్.. ఇట్స్ ఏ జర్నీ. ఈ డైలాగ్ మనం ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది కదా. మహర్షి సినిమాలో మహేష్ బాబు చెప్పిన డైలాగ్ ఇది. ఈ డైలాగ్‌లో చెప్పిన విధంగానే కొందరు తమ జీవితాలను అట్టా అడుగున మెద‌లు పెట్టి ఎవరూ ఊహించని స్థాయికి వెళ్లారు. వారిలో సామాన్యుల నుంచి సెలబ్రిటీలు కూడా ఉన్నారు. అలా దీనికి ఉదాహరణగా నిలిచిన‌ కొంద‌రి సెలబ్రిటీల జీవిత ప్రయాణం ఎలా మొదలుపెట్టారో ఇప్పుడు చూద్దాం.

kgf2

య‌ష్:
కే జి ఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో య‌ష్. ఆ సినిమాలతో ఒక్కసారిగా దేశం మొత్తం తన వైపు చూసేలా చేసుకున్నాడు. ఇక ఈ కేజీయ‌ఫ్ హీరో తన కెరీర్లో ముందుగా కన్నడ ఇండస్ట్రీలో బుల్లితెరల టీవీ సీరియల్స్ ద్వారా నటుడుగా పరిచయమయ్యాడు. నటన మీద ఆసక్తితో ఇంటి నుండి బయటకు వచ్చి మరి థియేటర్ ఆర్టిస్ట్ గా నటనకు సంబంధించిన శిక్షణ తీసుకుని సీరియల్స్ లో అవకాశాలు తెచ్చుకున్నాడు. ఆయన నటించిన నందగోకుల సీరియల్ సూపర్ హిట్ అవడంతో.. సినిమాలలో హీరోగా అవకాశాలు వచ్చాయి. అలా కేజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

నయనతార:
సౌత్ ఇండియన్ లేడీస్ సూపర్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ నయనతార. హీరోలతో సమానంగా క్రేజ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ. తన సినిమాలతో తనకంటూ ఓ సపరేట్ అభిమానులను కూడా క్రియేట్ చేసుకోగలిగింది. దర్శకుడు విఘ్నేశ్‌ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న నయనతార ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. న‌య‌న్‌ తన కెరియర్‌ను టెలివిజన్ ప్రెజెంటర్ గా మొదలుపెట్టి.. పలు ప్రొడక్ట్స్ కు, లైఫ్ స్టైల్ కి సంబంధించిన ప్రోగ్రామ్లకు టీవీ యాంకర్ గా పనిచేసి.. 2003లో ఒక మలయాళీ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది.

సాయి పల్లవి:
నాచురల్ బ్యూటీ సాయి పల్లవి తెలుగు తమిళ భాషల్లో వ‌రుస‌ సినిమాలలో నటిస్తు స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె కూడా తన కెరీర్ మొదటిలో పలు డాన్స్ షోలకు కంటెస్టెంట్ గా తన కెరీర్ ను మొదలుపెట్టింది. వాటిలో ఈ టీవీలో వచ్చే డి సీజన్ 4లో సాయి పల్లవి కంటెస్టెంట్ గా పాల్గొంది. నటన మీద ఆసక్తితో సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా మలయాళం ప్రేమమ్ సినిమాతో స‌క్సెస్ అయ్యి ఇప్పుడు వెన‌క్కు తిరిగి చూసుకోవ‌ట్లేదు.

Keerthy Suresh is a Perfection in Pink Thigh-High Slit Gown - See  Jaw-Dropping Pics!

కీర్తి సురేష్:
సీనియర్ హీరోయిన్ మేనక కూతురుగా ఇండస్ట్రీకి పరిచయమైన నటి కీర్తి సురేష్. ఈమె కూడా తన కెరీర్‌ను బాలనటిగా మొదలుపెట్టి. ఇక ఇప్పుడు సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది.

Actress Nazriya Nazim dazzles in this stills-నజ్రియా నాజిమ్ మస్తీ ఫొటోస్

నజ్రియా నజీమ్:
మలయాళీ హీరోయిన్ నజ్రియా కూడా తన కెరియర్‌ను ముందుగా ఓ టీవీ షోకు యాంకర్ గా మొదలుపెట్టి మలయాళం లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుని. మలయాళీ స్టార్ హీరో అయిన ఫహద్ ఫాజిల్ ని ప్రేమ వివాహం చేసుకుంది. నజ్రియా తొలిసారిగా తెలుగులో కూడా నాని హీరోగా వచ్చిన అంటే సుందరానికీ సినిమాలో నటించింది. ప్రస్తుతం మలయాళం లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతుంది.

Mrunal Thakur Pics: 'सीता रामम' की सक्सेस के बाद फिल्म से सामने आई मृणाल  ठाकुर की Inside Photos - mrunal thakur inside photos from dulquer salmaan  sita ramam worldwode box office collection

మృణాల్ ఠాకూర్::
ఈ సంవత్సరం సూపర్ హిట్ సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ముంబై ముద్దుగుమ్మ. ఆమె కూడా తన కెరీర్ ను ముందుగా బుల్లితెర పైనే మొదలుపెట్టి హిందీలో వచ్చిన కుంకుమ్ భాగ్య సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ క్రేజ్‌తో హిందీలో పలు సినిమాల్లో నటించి. తెలుగులో తన మొదటి సినిమాతోనే సూపర్ క్రేజ్ తెచ్చుకుంది మృణాల్ ఠాకూర్.