టాలీవుడ్ సినీ దిగ్గజం సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదఛాయలు ఆలుముకున్నాయి. కృష్ణ చనిపోయాడని మరణ వార్త విన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు అనే వార్త అందర్నీ ఎంతో బాధకు గురిచేస్తుంది. ఆయన లేరు అనే లోటును తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా పెద్ద లోటుగానే మిగిలిపోనుంది. కృష్ణ మరణంతో అయిన తనయుడు మహేష్ బాబు కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈనెల 15వ తెల్లవారుజామున 4 గంటల సమయంలో కృష్ణ మరణించారు.
కృష్ణ మరణంతో మహేష్ బాబు ఎంతో దుఃఖానికి లోనయ్యారు.. ఆయన బాధకు గురైన దృశ్యాలను చూసిన వారికి కూడా కన్నీళ్లు ఆగలేదు. ఈ క్రమంలోనే కృష్ణ గారు మరణించిన మూడు రోజుల తర్వాత మూడవరోజు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో ఘట్టమనేని కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. అలానే చిత్ర పరిశ్రమకు చెందిన కొంతమంది సినీ ప్రముఖులు,కృష్ణ అభిమానులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడికి వచ్చిన వారందరూ తమ ప్రియమైన హీరో సూపర్ స్టార్ కృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి కన్నీటి నివాళులు అర్పించారు.
ఇదిలా ఉండగా ఈ కార్యక్రమంలోనే సూపర్ స్టార్ పెద్ద కొడుకు దివంగత నటుడు మహేష్ బాబు అన్న రమేష్ బాబు కుటుంబ సభ్యులు కూడా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో రమేష్ బాబు భార్య కుమారుడు కుమార్తె విచ్చేయగా వారితో మహేష్ బాబు దిగిన ఫోటో నెట్టింట వైరల్ అయ్యింది. ఇక రమేష్ బాబు కూడా ఈ సంవత్సరం జనవరిలో మరణించిన విషయం మనకు తెలిసిందే. ఆయన మరణించిన అప్పుడు కూడా మహేష్ బాబు చాలా బాధకు గురయ్యారు.. ఆయనను చివరి చూపు చూసేందుకు కూడా మహేష్ బాబుకు వీలు కుదరలేదు. ఇక దీంతో మరింత దుఃఖంలో మునిగిపోయారు. ప్రస్తుతం మహేష్ బాబు తన అన్న కుటుంబ సభ్యులతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.