జబర్దస్త్ పంచ్ ప్రసాద్ గురించి తెలియని జనాలు వుండరు. ‘జబర్దస్త్’, ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోల ద్వారా హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ ఎంత ఫేమస్ అయ్యారో పంచ్ ప్రసాద్ కూడా అంతే బాగా పాపులర్ అయ్యాడు. ఇకపోతే చాలా ఏళ్ల నుంచి సదరు షోల్లో సందరి చేస్తున్న ప్రసాద్ కి కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. తనదైన నటనతో ప్రేక్షకులని కితకితలు పెట్టించే ప్రసాద్ కి కిడ్నీ ప్రాబ్లమ్ ఉందని భోగట్టా. దాని గురించి అతడే స్వయంగా చాలా సందర్భాల్లో బయటపెట్టాడు. అప్పుడప్పుడు తన ప్రాబ్లమ్ గురించి చెప్పి నవ్వించాడు కూడా.
అయితే ఇప్పుడు మాత్రం అంతకంటే పెద్ద సమస్య ప్రసాద్ కి ఎదురైందని తెలుస్తోంది. అవును, ప్రసాద్ ఇప్పుడు ఏకంగా నడవలేని స్థితిలో ఉన్నట్టు తెలుస్తోంది. కమెడియన్ జోడీ నూకరాజు, ఆసియా గత వారం నుంచి ప్రసాద్ ఇంట్లోనే ఉంటున్నారట. పంచ్ ప్రసాద్ భార్య చెప్పిన దాని ప్రకారం.. ఓరోజు షూటింగ్ తర్వాత ఫీవర్ గా ఉందని ఇంటికొచ్చిన ప్రసాద్.. తీవ్రమైన నడుము నొప్పితో బాధపడ్డారట. డాక్టర్స్ కూడా ఫస్ట్ ఎందుకు ఇలా జరిగిందో అర్థం కాలేదని, టెస్టులు చేస్తే నడుము వెనక వైపు కుడికాలి వరకు చీము పట్టేసినట్లు తెలిసింది అని ఆమె చెప్పింది.
అయితే ఈ విషయం బయట పెట్టడం ప్రసాద్ కి ఇష్టం లేకపోయినా ఈ మొత్తాన్ని షూట్ చేసి యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేసినట్లు సహ నటుడు నూకరాజు చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా అభిమానులు కూడా ప్రసాద్ కి సపోర్ట్ చేయాలని ఈ సందర్భంగా కోరాడు. కాగా ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయం తెలుసుకున్న ప్రసాద్ అభిమానులు కంటతడి పెడుతున్నారు. నీకేం జరిగినా మేము ఉన్నామంటూ అభిమానులు భరోసా ఇస్తున్నారు.