ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఆయన ఫ్యాన్స్ షాక్ ఇచ్చారు. పుష్ప2 కి సంబంధించిన అప్డేట్ ఇవ్వాలంటూ రోడ్డెక్కి రాస్తారోకో చేస్తున్నారు. అల్లు అర్జున్ రష్మిక మందన్నా జంటగా నటించిన పుష్పాది రైజ్ సినిమాని క్రేజీ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్నో సంచలమైన రికార్డులను క్రియేట్ చేసింది. ఎర్రచందనంస్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా నార్త్ లో పుష్ప సినిమాకు ఊహించిన స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో పుష్ప పార్ట్ 1 సూపర్ హిట్ అవడంతో అందరి చూపు పుష్పా2 పైన పడింది.
ఇక ఈ చిత్రం పై పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం సుకుమార్ ఈ సినిమా సీక్వెల్ రూపొందించే పనిలోనిలో ఉన్నారు. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా రీసెంట్ గా మొదలైంది. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇవ్వాలంటూ బన్నీ అభిమానులు గగోలు పెడుతున్నారు. అభిమానులు ఎంతగానో ఇష్టపడే హీరోని తెరపై త్వరగా చూడడానికి ఎంతో ఉత్సాహ పడుతున్నారు. త్వరగా తమ హీరోను తెరపైకి తీసుకురావాలని సినిమా యూనిట్ పై తీవ్ర ఒత్తిడి పెడుతున్నారు.
ఈ క్రమంలోనే గత కొద్దిరోజులుగా పుష్పా2 అప్డేట్ వచ్చేస్తుందంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది. ఇక దింతో ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో. బన్నీ అభిమానులు చేతిలో బ్యానర్లు- పోస్టర్లు పట్టుకొని పుష్ప2 అప్డేట్ ఇవ్వాలంటూ నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ఫిలిం ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలయ్య నిరసనలకు సంబంధించిన ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇక ఈ ఫోటోలో కనిపిస్తున్న వారు కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, యూఏఈ కి చెందిన అభిమానుల ఫోటోలు అని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
After the success of #PushpaTheRise , the cult of restless #AlluArjun fans have taken to the streets asking for an update on the sequel! This rage amongst fans is absolutely fantastic, a phenomena never witnessed before! The fervour and the excitement in their voices was loud.. pic.twitter.com/Ayu1F4piBj
— Ramesh Bala (@rameshlaus) November 15, 2022