పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కమెడియన్ అలీ రిలేషన్ గురించి అందరికీ తెలిసిందే. ప్రాణ స్నేహితులుగా పేరుగాంచిన వీరు 2019 ఎన్నికల తరువాత బద్ద శత్రువులు అయ్యారు. దానికి కారణం కూడా అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ నా గుండె అని చెప్పుకుంటూ తిరిగిన అలీ ఒక్కసారిగా యూ టర్న్ తీసుకొని పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనని కాకుండా YSRCP పార్టీకి అప్పట్లో మద్దతు ప్రకటించిన సంగతి తెలిసినదే. దాంతో టాలీవుడ్లో ఒక్కసరిగ్గా పెనుదుమారమే చెలరేగింది. అక్కడినుండి పవన్ సినిమాలు చేసినప్పటికీ అందులో అలీ పాత్ర లేకపోవడం మీరు చూసారు.
ఏపీ ప్రభుత్వం మొదలయ్యి సరిగ్గా రెండున్నర సంవత్సరాల తరువాత ఈ సానుభూతిపరుడు ఆలీకి తాజాగా ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా భాద్యతలు కట్టబెట్టిన సంగతి తెలిసిందే. దాంతో ఇపుడు కొన్ని మీడియా చానెళ్లు వైఎస్సార్సీపీ నాయకుడు అలీతో ఇంటర్వ్యూలు చేయగా అలీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపణలపై తాజాగా స్పందించారు. ఇప్పటం గ్రామం ఇష్యు నేపథ్యంలో అలీ తన స్పందనని వెళ్లగక్కాడు. ఇప్పటం గ్రామ ప్రజలు స్థలం ఇవ్వడంతో ప్రభుత్వం కక్షగట్టి ఇళ్లను కొలుస్తోందన్న ఆరోపణలను అలీ తప్పుబట్టారు.
ఈ మేరకు ‘సాక్షి’ ఛానెల్‌తో మాట్లాడిన అలీ.. “ఏపీ ప్రభుత్వం అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తోంది. నాకు తెలిసి అటువంటి ఆరోపణలు వైఎస్సార్సీపీపై వేయడం కరెక్టు కాదు. 151 సీట్లు ప్రజలు ఊరికే ఇవ్వలేదు. విశాఖపట్నం, రాయలసీమ, అమరావతి ఇలా అన్ని చోట్లా అభివృద్ధి జరుగుతోంది. అది మరి వీరికి కనబడటం లేదేమో. అనవసరంగా ఎవరు ఇలా మాట్లాడకూడదు!” అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు కమెడియన్ అలీ. కాగా ఈ విషయంపైన జనసేనులు కారాలుమిరియాలు నూరుతున్నారు. అలీ ఒక నమ్మక ద్రోహి అని, ఒక బ్రోకర్ అని, స్నేహాన్ని నయవంచన చేసిన దుర్మార్గుడు అని సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు.