కాజల్ అగర్వాల్.. ఈ పేరు తెలియని టాలీవుడ్ ప్రేక్షకుడు ఉండడంటే అతిశక్తి కాదు. లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మగధీర, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, ఆర్య 2 తదితర సినిమాలతో ప్రేక్షకుల మనసులు దోచేసింది. ఈ ముద్దుగుమ్మ 2021 అక్టోబర్ 30న బిజినెస్ మ్యాన్ గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకుంది. అతడితో కలిసి ఒక మగ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ఆమె ప్రస్తుతం యూనివర్సల్ హీరో కమల్ హాసన్‌తో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ఇండియన్ 2 షూటింగ్లో బిజీగా ఉంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
కాజల్ మరెన్నో అదిరిపోయే సినిమాలలో నటించడానికి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే కాజల్‌పై తన భర్త చాలా కఠిన షరతులు పెడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే భర్త గౌతమ్ కిచ్లు కాజల్‌ను సినిమాల్లో కొనసాగమని ప్రోత్సహిస్తున్నాడట. సినిమాలను విడిచిపెట్టవద్దని కూడా చెబుతున్నాడట. “నువ్వు సినిమాలు చూసుకున్నా.. నేను మన అబ్బాయి నీల్‌ను కూడా చూసుకుంటా. షూటింగ్ షెడ్యూల్‌లను మిస్ అవ్వద్దు యాక్టింగ్ కెరీర్ వదులుకోవద్దు.” అని కాజల్‌కి సపోర్టివ్ గా మాట్లాడడట. అదే సమయంలో అతడు ఆమెపై చాలా ఆంక్షలు పెట్టినట్లు సమాచారం.
రొమాంటిక్ రోల్స్, లిప్‌లాక్‌లు, బెడ్రూమ్ సీన్స్, ఇంకా తదితర అసభ్యకర సన్నివేశాలు చేయవద్దని ఆదేశిస్తున్నాడట. ఓన్లీ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు, పాత్రలకే సైన్ చేయమని ఒత్తిడి తెస్తున్నాడట. కాగా ఇప్పుడు కాజల్‌తో ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేసేందుకు ఎవరు ముందుకు వస్తారన్నదే ప్రశ్న. సమంత విషయంలోనూ మొదట ఇవే రొమాన్స్ వినిపించాయి. చైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత స్వేచ్ఛగా తాను సినిమాలు తీయలేకపోతున్నానని బాగా డిసప్పాయింట్ అయినట్లు కూడా వార్తలు వచ్చాయి. చివరికి ఆమె విడాకులు తీసుకుంది. దానికి కెరీర్ విషయంలో చైతు కుటుంబం ఆంక్షలు పెట్టడమేనా? అనేది వారికి తప్ప మిగతా వారెవరికి తెలియదు.
కాజల్ విషయంలో కూడా ఇప్పుడు అదే జరుగుతుంది. ఈ విషయంలో ఆమె భర్త మాట వినకుండా తనకు నచ్చినట్లు ఉండేందుకు విడాకులు బాట పడుతుందా అని చాలామంది సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. ఇప్పటివరకు విడిపోయిన అందరికీ హీరోయిన్ల వలె ఈమె పరిస్థితి కూడా అలానే అవుతుందా అని ఇంకొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.