గిద్దలూరు అశోక్ రెడ్డికే..టార్గెట్ ఈజీ కాదు.!

గత ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ వచ్చింది జగన్‌కు..పులివెందులలో దాదాపు 90 వేల ఓట్ల మెజారిటీతో వచ్చింది. ఇక జగన్ తర్వాత అత్యధిక మెజారిటీ వచ్చింది అన్నా రాంబాబుకు…గిద్దలూరులో దాదాపు 81 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయితే ఇంత మెజారిటీతో గెలిచిన రాంబాబుకు చెక్ పెట్టడం అనేది చాలా కష్టమైన పని. 81 వేల మెజారిటీని తగ్గించి..తిరిగి గెలవాలని టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డికి చంద్రబాబు టార్గెట్ గా పెట్టారు.

తాజాగా గిద్దలూరుకు సంబంధించి అశోక్ రెడ్డి..బాబుతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో బాబు కొన్ని కీలక సూచనలు చేశారు. ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు బాగా అందుబాటులో ఉంటున్నారని, ప్రజల్లో నమ్మకం కూడా పెరిగిందని, ఈ సమయంలో ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై దూకుడుగా ముందుకు సాగితే మంచి ఫలితం వస్తుందని అశోక్ రెడ్డికి బాబు సూచించారు. అలాగే బాదుడేబాదుడు బాగా నిర్వహిస్తున్నారని, కానీ పార్టీ సభ్యత్వాలు ఎక్కువ చేయడంలో విఫలమవుతున్నారని, వాటిపై దృష్టి పెట్టాలని చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో మీరే అభ్యర్థి. గెలుపే మీ లక్ష్యం కావాలి అంటూ అశోక్ రెడ్డికి దిశానిర్దేశం చేశారు. గత ఎన్నికల్లో అక్కడ వైసీపీకి మంచి మెజారిటీ వచ్చిందని, కానీ ఈ సారి పరిస్తితి లేదని, దానికి ఉదాహరణ టీడీపీలోకి వలసలు పెరగడమే అని చెప్పుకొచ్చారు. అయితే గిద్దలూరులో ఎమ్మెల్యే రాంబాబుకు పాజిటివ్ పెద్దగా లేదు. గత ఎన్నికల్లో వైసీపీ వేవ్, 2014లో ఓడిన సానుభూతి వల్ల రాంబాబు భారీ మెజారిటీతో గెలిచారు.

కానీ ఈ సారి ఆ పరిస్తితి కనబడటం లేదు..టీడీపీపై సింపతీ ఉంది. అటు జనసేనకు కాస్త బలం ఉంది. ఒకవేళ టీడీపీ-జనసేన కలిస్తే వైసీపీకి గట్టి పోటీ ఉంటుంది. అయితే టీడీపీ ఇంచార్జ్ అశోక్ రెడ్డి ఇంకా కష్టపడాలి. పార్టీలో ఉన్న పాత, కొత్త నాయకులని కలుపుని వెళ్ళాలి..అన్నీ వర్గాల ప్రజలకు దగ్గర అవ్వాలి. మరి చూడాలి గిద్దలూరులో అశోక్ టార్గెట్ రీచ్ అవుతారో లేదో.