స్టార్ యాంకర్ అనసూయ గ్లామర్ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వరుస ఫోటో షూట్లతో నేటిజెన్లకు మంచి విజువల్ ట్రీట్ అందించే ఈ ముద్దుగుమ్మ.. అప్పుడప్పుడు హాట్ ఫోటోలనే కాదు చీర కట్టులో కూడా స్టన్నింగ్ ఫోజులిస్తూ ఉంటుంది. ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా తన అందంలో ఎలాంటి మార్పు రాలేదని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా తన అంద చందాలతో కుర్రకారును కట్టిపడేసే ఈ ముద్దుగుమ్మ.. అతి తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. బుల్లితెరపై జబర్దస్త్ ద్వారా యాంకర్ గా గుర్తింపు పొందిన ఈమె.. తర్వాత వెండితెర పై కెరియర్ ను మొదలుపెట్టి.. అతి తక్కువ సమయంలోనే వెండితెరపై నటిగా తన ప్రస్తానాన్ని కొనసాగిస్తోంది.
ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే మంచి పవర్ఫుల్ పాత్రలలో నటిస్తూ మరింత పాపులారిటీ తక్కించుకున్న అనసూయ.. కాంట్రవర్సీలకు కూడా కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. తనకు సంబంధం లేని విషయాలు కూడా తలదూర్చి మరింత పాపులారిటీని దక్కించుకుందని చెప్పవచ్చు. ఇకపోతే ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తన గ్లామర్ ఫోటోలను పంచుకుంటూ మరింత రెచ్చిపోయే ఈ ముద్దుగుమ్మ తాజాగా చీరకట్టులో మరొకసారి కవ్వించింది. గ్రీన్ కలర్ చీరలో లేత నడుము అందాలను చూపిస్తూ మరింత రచ్చ రేపింది అనసూయ. ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన ఈ ఫోటోలు నెట్టింట సెగలు పుట్టిస్తున్నాయి.
మరి అనసూయ కెరియర్ విషయానికి వస్తే.. ఒకవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూనే మరొకవైపు స్టార్ హీరోల సినిమాలలో కూడా అవకాశాలు దక్కించుకుంటుంది. ఈ క్రమంలోనే దర్జా సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న అనసూయ ఇప్పుడు పుష్ప 2 సినిమాలో కూడా విలన్ పాత్ర పోషిస్తుంది. మరి మొదటి పార్ట్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు పుష్ప 2 సినిమాతో ఏ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకుంటుందో చూడాలి.