కోలీవుడ్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ కాలేకపోయినా హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. అటు తరువాత విలన్ గా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాలను అందుకుంటోంది. తాజాగా సమంత నటించిన యశోద సినిమా ప్రమోషన్లలో భాగంగా పాల్గొన్న వరలక్ష్మి అన్ని మీడియా సంస్థలకు ఇంటర్వ్యూ ఇస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. ముఖ్యంగా తెలుగు మీడియాతో ముచ్చటించడం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. ఆమె నటించిన కొన్ని తమిళ సినిమాలు తెలుగులో అనువాదం అయ్యాయి.. కానీ వాటి గురించి పెద్దగా ఎక్కడ ప్రమోషన్ చేయలేదు వరలక్ష్మి శరత్ కుమార్.
అయితే యశోద సినిమా రూపంలో ఈమెకు ఆ అవకాశం రావడం జరిగింది. కొన్ని రోజులుగా హైదరాబాదులోనే ఉంటున్న వరలక్ష్మి ,బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమాలో కూడా బాలయ్య చెల్లెలు పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం పైన కూడా భారీగానే ఆశలు పెట్టుకున్నది.మరికొన్ని సినిమాలు తన చేతిలో ఉన్నట్లుగా తెలియజేస్తుంది. అయితే వరలక్ష్మితో ఒక బడా బ్యానర్ ఏకంగా లేడీ ఓరియంటెడ్ చిత్రానికి ప్లాన్ చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఆ బ్యానర్ ఏదో కాదు తెలుగు సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్లో సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇటీవల ఈ సంస్థతో సినిమా చేయబోతున్నట్లు వరలక్ష్మి కూర అధికారికంగా ప్రకటించినట్లు సమాచారం. కానీ ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు మాత్రం ఇంకా తెలియజేయలేదు. వరలక్ష్మి యాక్టింగ్ స్కిల్స్ మెచ్చి నిర్మాత అల్లు అరవింద్ తనకి అవకాశం ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని డైరెక్షన్ చేసేది కూడా తమిళ డైరెక్టర్ అన్నట్లుగా సమాచారం. మరి అందుకు సంబంధించి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వెలబడుతుందేమో చూడాలి.