‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ లో ఈ 10 మిస్టేక్స్ గమనించారా..ఇవి లేకపోతే సినిమా సూపర్ హిట్..!

టాలీవుడ్ సీనియర్ దర్శకుడు ఇవివి సత్యనారాయణ నట వార‌సుడిగా సినిమాల్లోకి వచ్చిన అల్లరి నరేష్ తండ్రికి తగ్గ కొడుకుగా మంచి పేరు తెచ్చుకున్నాడు. కామెడీ సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్ వరుస సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ లో బిజీ హీరోగా కొనసాగుతూ వచ్చాడు. ఈ మధ్యకాలంలో అల్లరి నరేష్ చేసిన సినిమాలన్నీ ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి.

Itlu Maredumilli Prajaneekam Review | Itlu Maredumilli Prajaneekam Telugu  Movie Review with Rating | cinejosh.com

ఎప్పుడో వచ్చిన సుడిగాడు సినిమాతో హిట్ అందుకున్న నరేష్ మళ్లీ నాంది సినిమా వరకు సోలో హీరోగా హిట్ అందుకోలేకపోయాడు. మహేష్ బాబుతో మహర్షి సినిమాలో మహేష్ కు ఫ్రెండ్ పాత్రలో కనిపించి అలరించాడు. ఇప్పుడు మారేడుమల్లి ప్రజానీకం అనే వైవిధ్యమైన సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. నిన్న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల దగ్గర నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

Itlu Maredumilli Prajaneekam Movie Review: An honest social drama narrating  the plight of a tribal village
1. ఈ సినిమా స్టారి ప్ర‌ధ‌నంగా అడవి.. ఆ అడవే సర్వస్వం అనుకునే గిరిజనులు.. వారి సమస్యలు. అడవి కి దగ్గర్లో సరైన హాస్పిటల్ ఉండదు, ప్రమాదం వచ్చినప్పుడు హాస్పిటల్ కు వెళ్లాలన్నా.. వాగులు వంటివి వంటివి దాటాలి. అన్నీ దాటుకుని హాస్పిటల్ కు వెళ్లినా ప్రాణాలు నిలబడతాయన్న గ్యారెంటీ లేదు. గర్భిణీ స్త్రీలకు అత్యవసరమైన చికిత్స అందాలన్నా దొరకదు. అడవిని దాటుకుని చదువు కోవాలి అనుకునే యువత కూడా ఆశలు చంపుకుని బ్రతకాల్సిందే. ఇక లాంటి క‌థ‌లు మ‌నం రోజు పేప‌ర్‌లో చూస్తూనే ఉన్నాం. ఈ క‌థలో కొత్త‌ద‌నం లేదు.

2. ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలలో స్టోరీ కన్నా స్క్రీన్ ప్లే బాగుండాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. కథ ఎలా ఉన్నా స్క్రీన్ ప్లే బాగుంటే హిట్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఈ సినిమాలో కూడా స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉండటం వల్ల‌ ప్రేక్షకులను ఈ సినిమా చూడ‌డానికి ఇబ్బందిపడ్డారు.

Allari Naresh's 'Itlu Maredumilli Prajaneekam' Trailer Will Be Out Today

3. ఈ సినిమాలో స్టోరీ కూడా చాలా స్లోగా ఉండటంతో.. కథలో వచ్చే ట్విస్ట్‌లు కూడా ప్రేక్షకులకు ముందుగానే తెలిసి పోతుంటాయి.

4.ఇక ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ చాలా స్లోగా… ప్రేక్షకులకి చిరాకు తెప్పిస్తుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశం కొంత బాగున్నా ఇంటర్వెల్ తర్వాత సన్నివేశాలను ప్రేక్షకుడు ఈజీగా గెస్ చేసే విధంగా ఉన్నాయి.

5. ఈ సినిమా సెకండాఫ్ బాగానే ఉంది అనిపించినా క్లైమాక్స్ వచ్చేసరికి దర్శకుడు ప్రేక్షకులకు చిరాకు తెప్పించాడు. సినిమాలో క్లైమాక్స్ కూడా అన్ని సినిమాల్లో వచ్చిన రోటీన్ సీన్ చూసినట్లే ఉంటుంది. ప్రేక్షకుడి కోరుకున్న కొత్తదనాన్ని సినిమాలో చూపించలేకపోయాడు.

Itlu Maredumilli Prajaneekam Telugu Movie Review And Rating | Allari Naresh  | Anandi - Sakshi

6. సినిమాలో హీరోయిన్ పాత్ర‌ గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. హీరోయిన్ తన క్యారెక్టర్ కు తగ్గ న్యాయం చేసిన తన పాత్రను హీరోయిన్ కు ఎక్కువ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కు తక్కువ అన్నట్టు ఉంటుంది.

7. ఈ సినిమాకి సంగీతం అందించిన శ్రీ చరణ్ పాటలు బాగున్నా… బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తుంది.

Itlu Maredumilli Prajaneekam: రెండు వారాలు వెనక్కి వెళ్ళిన నరేశ్ మూవీ! -  NTV Telugu

8. ఈ సినిమాలో కామెడీ విషయానికొస్తే నరేష్ మంచి కామెడీ నటుడైన సినిమాలో తన పాత్రను ఎంతో సీరియస్‌గా చూపించాడు. కమెడియన్లలో ప్రవీణ్ పాత్ర కొంచెం బాగున్నప్పటికీ.. వెన్నెల కిషోర్ కామెడీ ప్రేక్షకులకు ఇబ్బంది కలిగిస్తుంది. రఘుబాబు తన పాత్రకు తన వంతు న్యాయం చేశాడు.

9. ఈ సినిమాలో అల్లరి నరేష్ ను సీరియస్‌గాను మంచి వ్యక్తిగా చూపించడం వల్ల అతను నుండి ఆశించే మినిమమ్ కామెడీ కూడా మిస్సయినట్టు అనుభూతి ప్రేక్షకులకు కలుగుతుంది.

Itlu Maredumilli Prajaneekam | Clearance for election duties.. Allari  Naresh team new update

10. నిమాకు డైలాగులు అందించిన అబ్బూరి రవి సంభాషణ బాగున్నాయి కానీ.. అల్లరి నరేష్ ఇమేజ్ కు సూట్ అయ్యే విధంగా లేవు.