బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ మొదటి భార్య అమృత సింగ్ వీరిద్దరికి జన్మించిన మొదటి అమ్మాయి సారా అలీ ఖాన్. హీరోయిన్ గా బాలీవుడ్‌లో 2018లో వచ్చిన కేదార్ నాథ్ సినిమాతో వెండి తెరకు పరిచయం అయింది. ఈ సినిమా తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ.. ఇప్పటికే స్టార్ కిడ్ గా ఎంతో క్రేజ్ ఉన్నప్పటికీ కూడా తన గ్లామర్ షో తో ఎప్పుడు రచ్చ చేస్తూనే ఉంటుంది.
బోల్డ్ గ్లామర్ షోతో ఎప్పుడు సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తూ నెటిజన్లకు అందాలు విందు చేస్తుంది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మాల్దీవుల్ కు వెకేషన్ కు వెళ్లగా అక్కడ హాట్ హాట్ ఫొటోస్ షూట్స్ షేర్ చేస్తూ.. తాజాగా బికినీ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ ఫోటోలో విశేషం ఏమిటంటే బికినీతో సైకిల్ తొక్కుతూ తన అందాలను ఆరబోస్తూ ఆ ఫోటోలలో సారా అలీఖాన్ ఉంది.
ఆ ఫోటోలు కింద ఈమె బీచ్ లైఫ్ చాలా బాగుంటుందని కామెంట్ కూడా ఇచ్చింది. ఇక ఈమె వ్యక్తిగత విషయాలను నిర్భయంగా అభిమానులతో పంచుకుంటూ ఇలా అందాలను ఆరబోయడంతో సారా అభిమానులు ఫిదా అవుతున్నారు. ఆ ఫోటోలకు క్రేజీ కామెంట్లు పెడుతూ.. లైక్ చేస్తూ ఫోటోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.