సాధారణ ప్రేక్షకుల నుంచి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు అందరూ కూడా ముహూర్తాలు, జాతకాలనే ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రం వాటిని కొట్టి పారేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో ఇలాంటి వాటి వల్ల ఎన్నో సమస్యలను కూడా ఎదుర్కోవలసి వస్తూ ఉంటుంది. అలాంటి వారిలో అలనాటి హీరోయిన్ నళిని జీవితం కూడా ఇలాగే జరిగిందట. సంఘర్షణ సినిమాతో చిరంజీవి పక్కన హీరోయిన్గా నటించిన ఈమె అసలు పేరు రాణి .
ఇప్పటి తరానికి నళిని గురించి చెప్పాలి అంటే రవితేజ నటించిన కిక్ సినిమాలో ఫ్రెండ్ మదర్ క్యారెక్టర్ లో నటించింది. అయితే గతంలో ఈమె అందం అభినయంతో చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. బాలనటిగా కూడా ఎన్నో చిత్రాలలో నళిని ఆ తర్వాత డైరెక్టర్ టి రాజేంద్ర దర్శకత్వంలో నటించిన ప్రేమ సాగరం అనే చిత్రంతో మరింత పాపులర్ అయింది. కెరియర్ బాగా సాగుతున్న సమయంలోనే వివాహం చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పింది. నళిని భర్త కూడా రామరాజన్ కోలీవుడ్లో మంచి పేరు ఉన్న డైరెక్టర్.
డైరెక్టర్ రామరాజన్ ,నళిని అందానికి నటనకు ఫిదా అయ్యి ఆమె తల్లిదండ్రుల వద్దకు వెళ్లి మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను వివాహం చేసుకుంటానని ఏకంగా నళిని తల్లితో చెప్పడంతో నళిని తల్లి కూడా ఆ డైరెక్టర్ ను చావబాదిందట. దీంతో తమిళ సినిమాలకు బ్రేక్ ఇచ్చి మలయాళ సినిమాలకి ఓకే చెప్పారట నలినీ తల్లి. ఆ తర్వాత నటి జీవిత సహాయంతో నళిని ,రామ రాజన్ వివాహం చేసుకున్నారు.వీరికి ఇద్దరు కవలలు కాగా జాతకాలని నమ్మే అలవాటు ఉన్న నళిని భర్త వారి పిల్లల జాతకాలు రీత్యా వారిని దూరంగా ఉంచాలని తన భార్య నళిని తో చెప్పారట.దీంతో కొన్ని మనస్పర్ధలు కారణం చేత వీరిద్దరూ విడిపోయారట. అలా మూఢనమ్మకాలతో వీరిద్దరు విడిపోయారని వార్తలు వినిపిస్తున్నాయి.