దీపిక పిల్లి గురించి కుర్రకారుకి బాగా తెలుసు. సినిమాల సంగతి అటుంచితే… ఈమధ్య తాజాగా జరిగిన బిగ్ బాస్ షో ద్వారా దీపిక పిల్లి బాగా పాపులర్ అయింది. దాంతో అమ్మడుకి వివిధ మాధ్యమాలలో అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం OTTల హడావుడి కొనసాగుతోంది. విభిన్నమైన కథలతో సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇక్కడ సందడి చేస్తున్నాయి. రియాలిటీ షో, టాక్ షో, డ్యాన్స్ షో అంటూ డిఫరెంట్ కాన్సెప్ట్ లతో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆడియెన్స్ నవ్వించేందుకు కామెడీ షోలు సైతం ఇపుడు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నాయి.
ఈ క్రమంలోనే తెలుగు OTT వేదిక ఆహా పుట్టుకొచ్చింది. ఈ ప్లాట్ ఫామ్ వేదికపై త్వరలో స్ట్రీమింగ్ కానున్న షో.. కామెడీ స్టాక్ ఎక్చేంజ్ గురించి వినే వుంటారు. ఈ షోకి యాంకర్స్ గా దీపిక పిల్లి, సుడిగాలి సుధీర్ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికీ బుల్లితెరపై కామేడీ షోలు అనేకం సందడి చేయగా అందులో కొన్ని మాత్రమే సక్సెస్ అయ్యాయి. ఈ షోకి ఛైర్మన్ గా దర్శకుడు అనిల్ రావిపూడి వ్యవహరిస్తున్న సంగతి తెలిసినదే. తాజాగా ఈ ఫస్ట్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేసింది ఆహా.
ఈ ప్రోమోలో యాంకర్ దీపిక పిల్లిని డైరెక్టర్ అనిల్ రావిపూడి ముద్దు పెట్టుకోబోతుండటాన్ని గమనించవచ్చు. అనిల్ రావిపూడి అలా వస్తుంటే దీపిక సిగ్గుపడుతూ కనిపించింది. ఆ తరువాత అందులో పార్టిసిపేట్ చేయబోతున్న స్కిట్స్ బిట్స్ చూపించారు. అవి చూడటానికి చాలా నవ్వు తెప్పించాయి. కాగా ఈ వేదికపై దీపిక పిల్లి బాత్రూం గొడవ గురించి చూపించారు. ఆమె ఒకసారి బాత్రూంకి వెళ్ళినపుడు అందులో ఒక అబ్బాయిని చూసిందట. దాంతో ఆమె అతనితో గొడవ పడగా…. పొరపాటున లేడీస్ టాయిలెట్ కి వచ్చానంటూ వివరణ ఇచ్చాడట పాపం.