ప్రస్తుత కాలంలో టెక్నాలజీ ఎంత పెరిగిన కూడా అదే అనుగుణంగా మోసాలు చేసే వారు కూడా పెరుగుతున్నారు. టెక్నాలజీని ఉపయోగిస్తూ వారి తెలివితేటలతో ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తున్నారు. ఇలా మోసపోయిన వారిలో సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు ఉన్నారు. ఇప్పుడు ఈ కోవలోకి టాలీవుడ్ సీనియర్ నటి జీవిత రాజశేఖర్ కూడా ఓ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకొని మోసపోయింది.
జియో బహుమతుల పేరుతో సినీనటి జీవిత రాజశేఖర్ ను మోసం చేశారు. సగం దొరకే జియో బహుమతులు ఇస్తానంటూ నరేష్ అనే వ్యక్తి జీవిత రాజశేఖర్ కు ఫోన్ చేసి ప్రస్తుతం జియోలో ఎలక్ట్రానిక్ గూడ్స్ పై మంచి ఆఫర్ ఉందని తాను రిఫర్ చేస్తే మీకు 50% వరకు డిస్కౌంట్ వస్తుందని నమ్మించి.
ఈ క్రమంలోనే దాదాపు ఎలక్ట్రానిక్ వస్తువులను రూ. 2.5లక్షలు విలువ చేసే వస్తువులను కేవలం రూ.1.50 లక్షలకు ఇస్తామని నమ్మేలా చెప్పాడు.
దీంతో ఆ మాటలు నమ్మిన జీవిత మేనేజర్ అతని అకౌంట్‌కు అడిగినంత డబ్బు కొట్టగా.. డబ్బు కొట్టిన తర్వాత నుండి అతను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా స్విచ్ ఆఫ్ అని రావడంతో.. జీవిత రాజశేఖర్ మోసపోయానని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తర్వాత చెన్నైకి చెందిన నరేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తి గతంలో కూడా చాలామంది నటీమణులను, ప్రొడ్యూసర్స్‌ని కూడా మోసం చేసినట్లు ఆధారాలు ఉండడంతో. అతనిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు.