వైసీపీలో ఆ ఎమ్మెల్యే సీటుకు ఎంపీ ఎసరు?

నెక్స్ట్ ఎన్నికల్లో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు దక్కడం కష్టమనే విషయం క్లారిటీగా అర్ధమవుతుంది. ఇప్పటికే సీఎం జగన్..పనిచేయని ఎమ్మెల్యేలకు సీటు ఇవ్వనని తేల్చిచెప్పేశారు. దీంతో ప్రజావ్యతిరేకత ఎదురుకుంటున్న కొందరు ఎమ్మెల్యేలకు సీటు దక్కడం జరిగే పని కాదని అర్ధమవుతుంది. ఇక వారి స్థానాల్లో కొత్తవారు బరిలో నిలపడం ఖాయం. అయితే ఇదే సమయంలో కొందరు ముందుగానే..సీట్లపై కన్నేస్తున్నారు.

ఇదే క్రమంలో కాకినాడ ఎంపీ వంగా గీతా..పిఠాపురం సీటుపై కన్నేశారని తెలిసింది. ప్రస్తుతం పిఠాపురం ఎమ్మెల్యేగా దొరబాబు ఉన్నారు..ఈయన పనితీరు పెద్దగా బాగోలేదు..ఇక్కడ పాజిటివ్ కూడా కనిపించడం లేదు. పైగా ఇక్కడ టీడీపీ, జనసేనల బలం పెరుగుతుంది. ఈ క్రమంలోనే ఆ రెండు పార్టీల పొత్తు ఫిక్స్ అయ్యేలా ఉంది. పొత్తు ఉంటే డౌట్ లేకుండా ఇక్కడ వైసీపీకి రిస్క్. అయితే దొరబాబు మళ్ళీ నిలబడితే..డౌట్ లేకుండా వైసీపీ ఓడిపోతుందని ప్రచారం జరుగుతుంది.

అందుకే నెక్స్ట్ ఆయనకు సీటు డౌటే అనే ప్రచారం వైసీపీలోని ఓ వర్గం ప్రచారం చేస్తుంది. దీంతో గీత పిఠాపురం సీటుపై ఫోకస్ పెట్టారని తెలిసింది. గతంలో టీడీపీలో రాజ్యసభ ఎంపీగా పనిచేసిన ఆమె..2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2019లో వైసీపీ నుంచి కాకినాడ ఎంపీగా పోటీ చేసి స్వల్ప మెజారిటీ తేడాతో గెలిచారు.

అయితే ఎంపీగా ఉన్న ఆమె..నెక్స్ట్ పిఠాపురం సీటులో పోటీ చేయాలని చూస్తున్నారట. ఈమెకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సపోర్ట్‌గా ఉన్నారట. ద్వారంపూడి ఎలాగో జగన్ సన్నిహితుడు. అందుకే ఆయన ద్వారా..పిఠాపురం సీటు దక్కించుకోవాలని గీత ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సీటు విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. కానీ వైసీపీ నుంచి ఎవరు నిలబడిన..టీడీపీ-జనసేన పొత్తు ఉంటే పిఠాపురంలో వైసీపీ గెలుపు డౌటే.